పేజీలు

Tuesday, November 5, 2013

ఏం చేసేది?? నేనేం చేసేది??


సుమధుర దరహాసంతో చిరున్నవ్వులు చింధించినా!
మమతల మాటలతో మమకారం చూపించినా!
మొండి మొగుడు పట్టించుకోడు ఏం చేసేది?? నేనేం చేసేది??

కడుపునిండా మూడుపూటలు భోజనం పెట్టినా!
కన్న తల్లికన్న మిన్నగా, పసిపాపకన్న ప్రేమగా చూసుకున్నా!
మొండి మొగుడు పట్టించుకోడు ఏం చేసేది?? నేనేం చేసేది??

వలపు సొగసులతో అందాలు ఆరబోసినా!
పరువం ప్రణయం తనకే అంకితం అన్నా!
మొండి మొగుడు పట్టించుకోడు ఏం చేసేది?? నేనేం చేసేది??

నీ నిద్రమత్తు వదలడానికి అలజడి సృష్టించనా?
చిపురుతో జాడించి దుమ్ముదులపనా??
నువ్వు మారని మనిషివని భాదపడనా???

నిద్రమబ్బు భర్తలతో ఏగుతూ, భర్యని సరిగ్గా పట్టించుకోనివారిని ఎం చేయాలో మీరే చెప్పండి..

Monday, September 23, 2013

చెలికాడి చిలిపి అల్లరి!


నా మేనిచాయ మెరుపు తీగలా,
మల్లె పూల మాల కట్టి,
జాలువారు జడన గుచ్చి,
పూల సజ్జ చేతబట్టి,
గందం మెడను చుట్టి,
చిరు చెమటల మోముతో,
వయ్యారి నడకతో,
హంస నడక నడుస్తుంటే,
చక్కనైన చిన్నోడు!
చెలికాడిని అన్నాడు..
చిర్రెత్తిన చిన్నది,
చిర్రు బుర్రు లాడుతుంటే,
ఆ అందం చూడతరమా!
ఆపతరమా ఆ సుగంధం!
అని కల్లబొల్లి మాటలతో మోసేస్తున్నాడు...

Thursday, August 29, 2013

నా మనసులోని భావం..



నీ కన్నుల వెలుగులో శయనించాలని ఉంది,
కాని నా చూపు నిన్ను వెతకడంలో తడబడుతుంది..

నీ అధరాల తీయదనాన్ని ఆస్వాదిన్చాలని ఉంది,
కాని నా  సిగ్గు వద్దొద్దని ఆపుతుంది..

నీ చిరున్నవ్వులోని హాయిలో  రేయి గడపాలని ఉంది,
నీకున్న పరిదిలో నేను నీకు తగునా అని నా మనసు సతమతమవుతుంది..

మధురమైన తేనెల మాటలలో మునుకలు వేయాలని ఉంది,
మౌనం నిన్ను దరిచేరకుండా ఆపుతుంది..

మనసులో భావాలన్ని నీతో పంచుకోవాలని ఉంది,
భావం భాషతో ఏకీభవించక మాటలురాకుండా చేస్తుంది..

నా మనసు నీరాకను గ్రహించి నీచెంతకు ఉరకలు వేయాలని ఉంది,
నాపై నీకున్న భావం ఏమిటో అర్ధంకాక పాదం వెనుకాడుతుంది..

నీతో కలిసి కలకాలం జీవించాలని ఉంది,
ఇవన్ని తెలియకుండా నిన్నెలా అంచన వేయాలో తెలియకుండా ఉంది.. 

Thursday, August 22, 2013

నీ తలపులతో !





నిన్ను తలవకుండ నిమిషమైన ఉండాలనుకుంటా,
కాని నువ్వు వదిలి వెళ్ళిన మనసు నాకన్న నిన్నె ఎక్కువగా తలుస్తుంది..

నీ పేరునైనా మరిచిపోదామని పెదవిని మౌనంతో భందిస్తే,
నువ్వు వెలివేసిన హృదయం నీపేరునే గుండె చప్పుడుగా మార్చుకుంది..

నీ రూపానయినా మరిచిపోవాలని కనురెప్పలను అడ్డుపెడితే,
కనుపాప కమ్మని స్వప్నంలొ నిన్ను తలచుకుంది..

నీ జ్ఞాపకాలనైన మరచిపోవాలని కన్నీటిని వదిలేసే,
కన్నీరు హృదయపుటంలొ కవితలా అళ్ళుకుంది..

నిన్ను తలవకుండా నిమిషమైన ఉండలేనని తెలిసి,
నాకు నేనె దూరమవుతున్నా..

నమ్ముతావా? అరిచేతుల్లో ప్రాణం పెట్టుకొని,
నువ్వు నాతోనే ఉన్నావన్న భావంతో జీవిస్తున్నాను..

Saturday, July 27, 2013

ఎవరికి సాధ్యం???



కన్నులకు రెప్పలు భారమా?
నా కనులతో నీకు లోకాన్ని చూపించడం సాధ్యం..

నింగికి చంద్రుడు భారమా?
నింగిలో చంద్రుడికి చుక్కలను కలబోసి వెన్నెలమ్మను చూపడం నిత్యం..

చెట్టుకి పూవు భారమా?
పూవులకి సుహాసన, మకరందాన్ని కలబోసి వికసించడం ఇస్టం..

మాటలకి భావం భారమా?
భావానికి భాష చేర్చి గుర్తింపునివ్వడం  పరమార్ధం..

నీ హృదయానికి నా మనసు భారమా?
నీ హృదయానికి నా హౄదయాన్ని జోడించి ప్రేమ ప్రపంచం చూపించడం తధ్యం..

నీరాకకై ఎదురుచూపులో నీరీక్షణ భారమా?
ఎదురుచూపులో ఉన్న తీయదనాన్ని ఆస్వాదించడం మనసుకున్న వరం..

విరిగిపోయిన హృదయాన్ని ఒకటి చేయడం ఎవరికి సాధ్యం?
మరి నా మోడుబారిన మనసును ఆనందపరచడం ఎవరికి సాధ్యం??? 

Saturday, July 20, 2013

"ప్రకృతి పారవశ్యం!"


నీలి మబ్బుల చాటున దాగిన చిరు జల్లుల అందం,
కురిసిన జల్లులకు పులకరించిన నేలతల్లి సుమగంధం,
సెలయేళ్ళ గలగల ప్రవాహ పారవస్యం,
పచ్చని చెట్లకు పూసే పూల సుగందం,
కోనేరులో తామర పూలందం, 
పూల మకరంధన్ని తాగే ప్రయత్నంలో కళ్ళనాకట్టుకునే సీతాకోక చిలుకల రంగులందం,
తూనీగల దోబూచులాటల ప్రణయమందం,
వానలో తడుస్తూ హాయిని అనుభవించి రాగాలు తీసే కోకిల స్వరగానం,
చిరుజల్లుకు మయురి నాట్యం చేస్తు పురివిప్పిన అందం అద్బుతం,
నన్ను తడిమిన ప్రతీ చినుకులో మాధుర్యం,
ప్రకృతి ఒడిలో నేను తన్మయం చెందిన వైనం, 
ఇన్ని అందాలను ఆస్వాదిస్తున్న పడుచు సుకుమారమందం, 
వర్ణనాతీతం,సుమధుర అనుభవం...

Happy Rainy Season ...

Friday, July 19, 2013

నేనుంటా నీతోడు!


నీ గెలుపులో నీ సంతోషాన్నవుతా,
నీ ఓటమిలో నీ ఓదార్పునవుతా..

నీ చిరునవ్వులో నీ ఆనందానవుతా,
నీ కన్నీళ్ళలో నీ బాదనవుతా..

నీ నడకలో నీ పాదానవుతా,
నీ చేతిలో గీతనై వందఏళ్ళ నీ జీవితానికి భందానవుతా..

నీ మాటలో మాటనై నలుగురిలో గుర్తింపునవుతా,
నీ దైవారాదనలో భక్తిగా పూజించే పూవునవుతా..

నువ్వు పాడే పాటలో సరిగమల సంగీతానవుతా,
నువ్వు ఆరాదించే నాట్యంలో పాదానవుతా..

నీ శ్వాశలో శ్వాశనై నీ ఊపిరినవుతా,
నీ హృదయం ప్రాణమై జీవితానతం నీతోడు నీడనైనేనుంటా..

Thursday, July 18, 2013

నిన్నేల క్షమించనేల???


ఆదివారము నాడు అలకపూనితే!
సోమవారము నాడు నీసొగసు చూడవస్తానంటివి..

సోమవారము నాడు నీకై ఎదురుచూడగా!
మన్నించు మంగళవారము నాడు నీ మురిపం చుడనొస్తానంటివి..

మంగళవారము నాడు నీకై ఎదురుచూడగా!
మతిమరిస్తి బుదవారం నాడు బుజ్జగించ వస్తానంటివి..

బుదవారం నాడు నీకై ఎదురుచూడగా!
బుద్ది బ్రమించే గురువారం నాడు గుస్సతీర్చడానికివస్తానంటివి..

గురువారం నాడు నీకై ఎదురుచూడగా!
గురకపెట్టి నిద్రపోతిని శుక్రవారం నాడు నీ సింగారంచూడ వస్తానంటివి..

శుక్రవారం నాడు నీకై ఎదురుచూడగా!
చలికి వణికిపోయా శనివారం నాడు సరసమాడ వస్తానంటివి..

శనివారం నాడు నీకై ఎదురుచూడగా!
శనీడ్డంవచ్చే మన్నించు ఆదివారము నాడు అలకతీర్చ వస్తానంటివి..

ఆదివారము పోయి మళ్ళీ ఆదివారము వచ్చే!
నువ్వు మాత్రం రాలేదు..

పో,
పో,
పో,
పో,

నిన్నేల క్షమించనేల???

Wednesday, July 17, 2013

♥♥ హృదయస్పందన ♥♥


నా మనసుకేమయింది ఈవేళ,
స్వర్గం నా కళ్ళముందున్నట్టుంది,
కనురేప్పలమాటున స్వప్నంలో ఎన్నేన్నో ఆశలు దాగినట్టుంది,
నాఉహల ప్రపంచం ఎంతో అందగా మలిచినట్టుంది,
నన్నేవరో మురిపించి మైమరిపించినట్టుంది,
మోహనాంగి అని, సొగసుల సౌందర్యని స్పర్షించినట్టుంది,
తుంటరి వయసులో కంగారుతనాన్ని మెచ్చుకున్నట్టుంది,
నామనసుతో  ఇంకోమనసుతో జతచేసినట్టుంది,
ఏడు రంగులతో వెలిసిన అందమైన హరివిల్లు నేనే అన్నట్టుంది,
సాగరానికి చేరువైన నధిలా ప్రవహించినట్టుంది,
కన్నేపిల్ల మనసు దోచినట్టుంది..
నా హృదయస్పందన ఇంకేలా ఉంటుందోమరి,
ఇదంతా ఏమి మహాత్యం, ఏమి అద్బుతం..

Monday, July 15, 2013

నా పేరంటి??


ముద్దబంతి పూవుల ఉండే భారతినా,
సన్నజాజుల ఉండే సరియునా,
మల్లెపూల ఉండే మృధులనా,
నిర్మలమైన నదిలా ఉండే నర్మదనా,
కిటకిట కంటిచూపుతో కట్టేసే కృష్ణవేణినా,
గలగలా నవ్వే గంగనా,
వయ్యారాల నడకతో వినీతనా,
కిల కిలా అల్లరిపెట్టే కిరణ్మయినా,
తొలివెచ్చని కిరణంలా తాకే ఉదయశ్రీనా,
సూర్యాస్తమయాన్ని తలపిచే సంధ్యనా,
అమాయకమైన ముఖముతో అలరించే అఖిలనా
అందమైనా గులాబిలా గుబాలింపుల రోజానా,
మనసు ప్రశాంతంగా ఉండే ప్రశాంతినా,
వెన్నేల్లో అల్లరిపెట్టే చంద్రబింబాన్ని తలపించే చంద్రలేఖనా,
పసిడి కాంతితో పరవళ్ళు తొక్కే స్వర్ణలతనా,
వాసంత ఋతువులో హాయిగావీచే సమీరనా,
నెమలిలా నాట్యాన్ని తలపించే మయురినా,
అందరినిమెప్పించే అందాల భరణినా,
శ్రీమహాలక్ష్మిని తలపించే సిరినా,
మృధుమధురంలా సాగే శృతిలయల సంగీతాల లహరినా?

మీరైనా చెప్పగలరా?

Monday, July 8, 2013

తెలుగమ్మాయి!!


వేకువఝామున పిల్ల గాలిలా,
ముంగిలిలో ముత్యాల ముగ్గులా,
తొలివెచ్చని సూర్యకిరణంలా,
కిటికిలోంచి తొంగిచూసే మల్లె పరిమళంలా,
బోసినవ్వులొలికించే పసిపాపలా,
నదిలో చిలిపిగా ఆడె చేపపిల్లలా,
గల గలా ప్రవహించే గోదారిలా,
కిలకిల గానంతో కొకిలలా,
తేట తేనెలొలుకు తెలుగు మాటలా,
పడుచందాల పరికినితో,
స్వచ్చమైన మనసులా,
సాయంకాలం సంధ్యలా,
అల్లరి పెట్టే వెన్నెలలా,
కాళ్లకు పారాణితో కింద పెడితే కందిపోయేలా,
నాట్యాన్ని తలపించే చెవిలోలాకులా,
ముత్యమంత ముక్కు పుడకలా,
గలగలమంటు గాజుల సవ్వడిలా,
సిగ్గులొలికే చిరునవ్వులా,
చిటపటలాడే వాన చినుకులా,
ప్రకృతి మత్తులో గుసగుసలాడే సీతాకోక చిలుకలా,

మొత్తం కలబోస్తే తెలుగమ్మాయి!! 

Saturday, June 29, 2013

♥ ప్రేమ లేఖ ♥


నీకోసమే కాలోచిస్తు రాసానొక లేఖ.
నా నీకోసం!
పౌర్నమి రోజు చంద్రుడిలో వెండి వెన్నెలగా నిన్ను చూసా,
వేసవి ఉష్ణం తాపంలో వెలుగైన కిరణంలా నిన్ను చూసా,
వర్షంలో తడిసి ముద్దవుతూ చినుకులో నిన్ను చూసా,
చల్లని పొగమంచులో నీకౌగిలనే ఊహను చూసా,
నా కళ్లనే సముద్రములో నిన్ను దాచా, కాని కన్నిరై బయటపడకుండా చూసా,
నా హృదయం అనే ఆలయంలో నిన్ను చూసా!!
అనుక్షణం నీకోసమే నీ ద్యాసలో ఉంటా!!!

♥♥ అందుకో నా లేఖ ♥♥ !!!

అది నీవే!


అందానికి చందానికి అందెలు వేసి ,
చిగురాకుల లేలేతల సొగసున నింపి,
సెలయేటి గలగలలే నవ్వున దాచి,
మైనాన్నే శిల్పంగా దేవుడు చేస్తే,
నీవన్నది నిజమైనది నా కళ్ళముందు,
శృంగారము ప్రేమతో జతకడితే అది నీవు ....
నుని పెదవుల వాకిట్లో ఆ మాటల సయ్యాటల,
ఏ బాష చెప్పగలదు ఏ చిత్రము చూపగలదు.
ఉప్పొంగే కెరటంలా ఇరుజతల పాటను,
ఏ రాగము అందగలదు ఏ స్వరము పాడగలదు.
పాదాలు కదిలితే పరవళ్ళు,
నీ చెంగు ముడిలోన చెరసాల సంకెళ్ళు.
ముదుగుమ్మ నీవేవరమ్మ,
నేలకు అద్దిన పారానివా,
స్వర్గము తప్పిన దేవతవా,
నెలవంకను నడుములో దాచినా నిశిరాత్రి జాబిలివా ...

Saturday, June 22, 2013

♥♥ నువ్వు నేను ♥♥




నువ్వు నిదురపోతున్నపుడు, నీస్వప్నాన్ని పంపు!.
నా స్వప్నాన్ని పంపుతున్నాను, నీకన్నుల్లో దాచుకో!.

నువ్వు నవ్వుతున్నప్పుడు, నీసంతోషాన్ని పంపు!.
నా సంతోషాన్ని పంపుతున్నను, నీపెదవిలో చేర్చుకో!.

నువ్వు బాదగా ఉన్నపుడు, నీకన్నీటిని పంపు!.
నా కన్నీలను పంపుతున్నాను, నీఓదార్పుతో ఆవిరిగా మర్చుకో!.

నన్ను తలుచుకుంటూ, నీలో ఉన్న నా మనసును రాగాన్ని పంపు!.
నా మనసు రాగాన్ని పంపుతున్నాను, నీలోని నామనసుతో పంచుకో!.

నీ చేతికి నా  చేయందిస్తున్నాను, ప్రేమగా చూసుకో!.
నువ్వు నేను అనే బావాన్ని వదిలి మనం అన్న ప్రేమతో మెలుగుదాము!...



Saturday, June 15, 2013

నీకు తెలుసు!..


నను ఎప్పటికి కలవలేవని తెలుసు,
తెలిసి కూడా నాతో మాటలు కలిపావు!...

నన్ను ఎప్పటికైన ఏడిపిస్తావని తెలుసు,
తెలిసి కూడా నన్ను  నవ్వించావు!...

నన్ను ఎప్పటికి తాకలేవని తెలుసు,
తెలిసి కూడా నన్ను కవ్వించావు!...

నాలో ఎప్పడికి కలవలేనని తెలుసు,
తెలిసి కూడా నాతో ప్రణయ ప్రయాణం సాగించావు!...

నాకు దూరం ఆవుతావని తెలుసు,
తెలిసి కూడా ప్రేమించావు!...

నా కన్నీళ్ళను నీకు తెలియకుండా దాచేస్తున్నానని తెలిసు,
తెలిసికూడా గమనిచక దాటెస్తావు!...

అనుకోకుండా  ప్రేమించావు,
తెలిసి తెలిసి దూరమవ్వుతున్నావు!...

ఇన్ని తెలిసిన నీకు,
నేను ఎలా ఉంటే సంతోషంగా ఉంటానో తెలియదా???
జీవితం ప్రశ్నలా మార్చొద్దు..