పేజీలు

Monday, December 31, 2012

నూతన సంవత్సర శుభాకాంక్షలు...

కొత్త ఆలోచనలు,
కొత్త ఆశయాలు,
కొత్త విజయాలు,
ప్రేమాభిమానాలు,
ఆప్యాయత, అనురాగాలు
మీ అందరి సొంతం కావాలని ఆశిస్తూ,
ప్రతి ఒక్కరి జీవితం రంగులమయం కావని ఆశిస్తూ,
భారతదేశం లోని ప్రతిఒక్కరు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ,
పల్లేటుర్లు సస్యశ్యామలంగా ఉండాలని ఆశిస్తూ,
ప్రపంచం లో అందరు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ,
మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
బ్లాగ్ మిత్రులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు...
2013 నూతన సంవత్సర శుభాకాంక్షలు...

Tuesday, December 25, 2012

నాకు తెలియదు...

పెదవి పలికేది కాని,
ఆ పలుకులు ఇంత మధురమైనదని,
నీ పేరు పలికేవరకు తెలియదు!

గుండె కొట్టుకునెది కాని,
అది నీ తలపుతోనే అని,
నిన్ను ప్రేమించేవరకు తెలియదు!

మన ఇద్దరి మధ్య స్నేహం ఉంది కాని,
ఆ స్నేహం ప్రేమకు దారి తీస్తుందని,
నీ ఓరచూపులతో నన్ను చూసేవరకు తెలియదు!

వయసు మొగ్గెసింది కాని,
అది పుష్పించిందని,
నువ్వు తాకేంతవరకు తెలియదు!

నాలో బావం ఉంది కాని,
సిగ్గు మొగ్గలేసుందని,
నువ్వు తొలిముద్దు ఇచ్చేవరకు తెలియదు!

నా తడి ఆరని అందాలు,
నీకు మాత్రమే సొంతమని,
నీలో కలిసేవరకు తెలియదు!

ఊపిరి ఆగిపోయెవరకు నిన్ను మరచిపోలేనని,
మన ప్రేమ చిరకాలమని,
నిన్ను ప్రేమించేవరకు తెలియదు!

శృతి లయల సంగమంలా మన జీవితం సాగిపొతుందని,
నా ప్రేమే నా ప్రాణమని,
నీతో కలిసి జీవించేవరకు తెలియదు నా ప్రాణమా!...

Thursday, December 20, 2012

నా ఆవేదన!
నీ ప్రేమలో నన్ను నేను వెతుక్కోవాలనుకుంటాను,

నువ్వే కనిపించకుండా పోతావు...

నీ సాన్నిహిత్యంలో సేద తీరాలనుకుంటాను,

ఎండమావివై వెక్కిరిస్తావు...

నా కాలిమువ్వల సవ్వడితో నిన్ను పిలవలనుకుంటాను,

ఆ మువ్వల సవ్వడే వినిపించదంటావు...

నీ ప్రేమరాహిత్యంలో ఘనీభవించిన హృదయాన్ని నీ వెచ్చటి కన్నీటి జల్లుతో కరిగిస్తావు,

కరిగి కన్నీరయిన నన్ను మండుటేండగా మారి మరిగిస్తావు...

హృదయం చాలని అనుభూతివనుకుంటే,

జన్మకు చాలని ఆవేదన మిగిలిస్తావు...

Thursday, December 13, 2012

ఎలా చ్చెప్పను???నాలో ఉన్న నమ్మకానికి,
నను నడిపించే ధైర్యానివి నువ్వేనని నీకెలా చ్చెప్పను?
నాలో ఉన్న శ్వాస ఉచ్చ్వాసకి,
నను బ్రతికించే ఆశవి నువ్వేనని నీకెలా చ్చెప్పను?
నీపేరే పలకాలను కోరే నా పెదాలకి,
నా చిరునవ్వే నువ్వని నీకెలా చ్చెప్పను?
నిన్ను ఆశగా వెతికే చుపులకు,
నా కంటిపాపవు నువ్వేనని నీకెలా చ్చెప్పను?
నీ ఆలోచనలో  మునిగిపొయిన నా మనసుకి,
నా మనసాక్షివి  నువ్వేననినీకెలా చ్చెప్పను?
నేను పెట్టిన మువ్వల సవ్వడికి,
నా అడుగుల సవ్వడి నువ్వేనని నీకెలా చ్చెప్పను?
నాలోని ప్రతి జ్ఞాపకానికి,
నా గుండే చప్పుడు నువ్వేనని నీకెలా చ్చెప్పను?
మనం ఇద్దరం గడిపిన ప్రతీక్షణం,
నీపై నాకుంది ప్రేమేనని నీకెలా చ్చెప్పను?