పేజీలు

Wednesday, January 23, 2013

ప్రేమంటే!!!

వర్షంలో ఒకే ఒక్క గొడుగులో నడిచిన
మన పాదాల అడుగులకు తెలుసు ప్రేమంటే!

మేఘల ఘర్షణ లో ఉరుముల మెఱుపుకు
కలిసిన మన కనులకు తెలుసు ప్రేమంటే!

కంటి సైగతో పలకరిస్తే బదులు పలికే
చిరునవ్వుకు తెలుసు ప్రేమంటే!

మమత నిండిన నీచేతి స్పర్శతో
స్పందించే నామదికి తెలుసు ప్రేమంటే!

మల్లే, సన్నజాజి పూల పరిమళానికి
నిన్ను ఆకర్షిచే మైకానికి తెలుసు  ప్రేమంటే!

కలలు నిజమై మన మనసులు ఒక్కటై
మమతానురాగానికి తెలుసు ప్రేమంటె!

అల్లిబిల్లి కబుర్లతో, చిలిపి సరసాలతో
నన్ను ఆట పట్టించే, అమాయకత్వానికి తెలుసు ప్రేమంటే!

నా ఆశ, శ్వాశ, తల్లి, తండ్రి, ప్రాణం నీవై
నన్ను ప్రాణంగా చూసుకునే స్నేహానికి తెలుసు ప్రేమంటే!

మన ఇరువురి మధ్య ప్రణయమై
కలసిపోయే మన హృదయనికి తెలుసు ప్రేమంటే!