పేజీలు

Monday, January 30, 2012

క్షణం క్షణం నీ జ్ఞాపకాలు.....ఎందుకిలా అవుతోంది.
అనుభూతులు నాలో.
జీవం పోసుకుంటున్నాయి.
అసలు నువ్వు లేకుండా.
ఒక్క క్షణం కూడా గడవదే.
ఎంతమందితో ఉన్నా.
నీతో ఉన్న అనుభూతి లేదే.
ఎందుకిలా అవుతోంది.

నీ పిలుపుకి.. నీ నవ్వుకి..
నీ అలకలకి.. బుంగమూతికి,
నీతో కలిసే అడుగులకు,
నీకై కలిపే అన్నం ముద్దలకు,
నీకోసం వెతికే కళ్లకు,
బదులేమీ చెప్పలేకున్నా...
తొందరగా వచ్చేసేయ్.. ప్లీజ్...!!

Thursday, January 26, 2012

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.......


ఏ దేశమేగినా, ఎందు కాలిడినా.
ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా. 
పొగడరా నీ తల్లి భూమి భారతిని.
నిలుపరా నీ జాతి నిండు గౌరవము.

Saturday, January 21, 2012

ప్రేమేనా....


ఎందుకో నాలో ఈ తాపం .....
అద్దంలో నీ రూపం .....
తలపంతా నీ మైకం .....
నువ్వయ్యవు నా లోకం .....
ప్రేమేనా దీని అర్ధం !!!!!

Wednesday, January 18, 2012

సంగీతం..........

సంగీతం లోని సప్త స్వరాలే సాహిత్యానికి నవనాడులు.
కఠిన పషానాన్ని సైతం కరిగించే మధుర కావ్యాలు.
ఎండమావిలో నీటిని చూపగల కమ్మని రాగాలూ.
ఎండిన మోడుని చిగురిమ్పచేయ్యగల ఆశల గీతాలు.......

Saturday, January 14, 2012

నీ ప్రాణం......


కమ్మగా పాడే కోయిలనడిగాను,
నీ తీయని మాటలతో నను మురిపించేది ఎపుడని ...
చల్లగా వీచే చిరుగాలిని అడిగాను ,
నీ చల్లని చూపుతో నను తాకేది ఎపుడని...
వర్షించే మేఘాన్ని అడిగాను ,
నీ నవ్వుల జల్లుల్లో నను తడిపేది ఎపుడని ...
హాయిని పంచే వెన్నెలని అడిగాను ,
వెన్నల్లో హాయిగా ఊసులడేది ఎపుడని ...
పరుగులు తీస్తున్న సెలయేటిని అడిగాను ,
నీ పరుగు నా కోసమేనా ? అని ...
నాలో ఉన్న నా ప్రాణమైన నీకు తెలిపాను ,
నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని ,
నా దరి చేరమని ..... నను బ్రతికించమని ......

Tuesday, January 10, 2012

సంక్రాంతి శుభాకాంక్షలు.......


పాల పొంగలి.....
రంగుల ముంగిళ్ళను.....
ముద్దుగొలిపే గొబ్బిళ్లు.....
బావా మరదళ్ల ముచ్చట్లు.....
అందరి గుండెల్లో .....
ఆనంద పరవళ్ళు.....
అందరికి  ఇదే నా సంక్రాంతి శుభాకాంక్షలు.......

ప్రియురాలి వర్ణన


తొలిపొద్దు పొడుపులో మంచుకన్న తెల్లనైన నీ రూపం
చిరు గాలి కన్నా చల్లనైన నీ చిరునవ్వు
ముత్యాల వంటి పళ్ళు కలువరేకుల లాంటి కళ్ళు
నయాగరా జలపాతం లాంటి కురులు కల
నా చెలిని చూసి ఆ నెలవంక నివ్వెరబొయెనా లేక ఆ వెన్నెల వాలిపోయెనా
నీ కోసం వేచి యున్న నాపై ఒకసారి నీ మనసు ద్వారాలు తెరిచి చిరునవ్వుల వర్షం కురిపించలేవా
ఆ చిరునవ్వు కోసం వదిలేస్తాను నా పంచ ప్రాణాలు ఓ నేస్తమా

Saturday, January 7, 2012

నీ జ్ఞాపకాలు

 మనసులోని భావాలెన్నో మరువలేని గాయాలెన్నో
వీడలేని నేస్తాలెన్నో వీడిపోని బంధాలెన్నో
మరపురాని పాటలెన్నో మధురమయిన క్షణాలెన్నో
కవ్వించే కబుర్లెన్నో మాయమయ్యే మార్పులెన్నో
అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో
ఆస్చర్యపరిచే అద్భుతాలెన్నో మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో
ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...

మనిషి జీవితంలో మరువలేని ఇంకెన్నో ఇదే జీవితం... దీనిని అనుభవించు అనుక్షణం

Monday, January 2, 2012

సాగిపో నీ దారిలో

జీవితమనే బందాల భవసాగరంలో ఆటు పొట్ల వంటివి కష్ట సుఖాలు
కష్టాలు అలల ఎగిసినప్పుడు తలవంచక గమ్యం దిశగా పయనించు
సుఖాల సుడిగుండంలో చిక్కిన మనిషికి నడిచే దారి వుండదు
పదుగురు నీ వెంట వున్నా లేకున్నా ప్రపంచానికి నూతన మార్గం చూపించు
ప్రేమ, సహనం, కరుణ కలిగిన సమ నమజం నిర్మించు ...