పేజీలు

Monday, April 30, 2012

నీకోసం నేను పసిడిబొమ్మ నవుతా...


మండుతున్న ఎండను శాంత పరిచే
తొలకరి చిరు జల్లులా వస్తాను...
తీగలా నిన్ను అల్లుకొని నీ మదిలో 
పువ్వులా ఆనంద రాగాలూ పలికిస్తాను...
వసంతాన కూసే కోయిల రాగమై
నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసే కిల కిల రావం అవుతాను...
చిలిపి చేష్టలతో నీలో హావా భావాలను
పలికించి హాయిగొలిపే పసిడిబొమ్మ నేనౌతాను...

Friday, April 27, 2012

నా ఉహా.....


కరుణించే కంఠస్వరం నీవైతే
గర్వించే గుండే నేనవుతా...
వర్షించే మేఘము నీవైతే
సప్తవర్ణాల హరివిల్లు నేనవుతా..
వెసే ప్రతి అడుగు నీవైతే
పులకించే ప్రతి స్పందన నేనవుతా..
మెరిసే తారక నీవైతే
పరచే ఆకాశం నేనవుతా..
ఎద చిత్రించే కలల కుంచె నీవైతే
మది ఫలకంపై ఆశల రంగునవుతా..
ఏ కాంతిలేని ఏకాంతంలోకి పడవేస్తే
నీకు వెలుగునిచ్చే మినుగురు నవుతా..
వరములిచ్చే ప్రేమ నీవైతే
నీకు దాసోహం నేనవుతా.....

Tuesday, April 24, 2012

నువ్వే నా ప్రపంచం...


ప్రతీ ఒక్క ఘడియ నేను నీ కోసమే ఆలోచిస్తాను.
ప్రతీ ఒక్క నిమిషం నేను నీ గురించే పరుగులు తీస్తాను.
ప్రతీ ఒక్క గంట నిన్ను చేరడానికి ప్రయత్నిస్తాను.
ప్రతీ ఒక్క రోజు నీ గురించే కళలు కంటాను.
ప్రతీ ఒక్క క్షణమ్ నేను నీతొనె ఉండాలని కోరుకుంటాను..
అందుకే నువ్వే నా ప్రపంచం...

Friday, April 20, 2012

నా హృదయం....మనసు ముందరే ఆగిపొయిన నీ ప్రేమ అల.
మౌనం చుట్టూ బంధీ చేసిన నీ ఊసుల వల..
పెదవుల అంచుల్లో వినపడని నీ మాటల గలగల.
కన్నుల కొసరునే నువ్వు కడుతున్న కన్నీటి మాల..

నీ తలపుల ఇంధనంతో మండిపొతోన్న ఆలోచనల జ్వాల.
ఈ విషాదపు చాయల్లో నువ్వు ఊపుతున్న చేదు జ్ఞాపకాల ఊయల..
నిన్ను కానరాక నిద్రలేక ఒంటరైపోతున్న నా కన్నుల కల.
నువ్వు దక్కక అయిపోతోంది నా హృదయం ఒక శిల..

Wednesday, April 18, 2012

తోడును నీడను.....పసుపుతాడు కట్టి నీకు దగ్గరకకపోయినా,
నీ కడుపులో పసివాడినై ,
నీ ప్రేమను పొందుతాను ,
నీతో పాటు ఏడు అడుగులు నడవకపోయిన,
ఏనాడు.. తోడును నీడను విడువను
నా శ్వాస ఉన్నంత వరకు, నీకు అన్ని నేనై ఉంటాను......

Friday, April 6, 2012

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు....


ఈరోజు హనుమాన్ జయంతి. దేశం నలుమూలలా హనుమాన్ జయంతి ఫెస్టివల్ సెలెబ్రేషన్స్ జరుగుతాయి. విదేశాల్లో స్థిరపడ్డ హిందువులు తమదైన పద్ధతిలో హనుమాన్ జయంతి ఫెస్టివల్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసం పౌర్ణమినాడు హనుమాన్ జయంతి వస్తుంది. హనుమంతుడు, రాముని నమ్మినబంటు.

రామునిమీద ఆంజనేయునికి ఎంత భక్తి అంటే, ఒక సందర్భంలో తన గుండె చీల్చి చూపగా అక్కడ సీతారాములు కొలువై ఉంటారు. మరోసారి హనుమాన్ సీతాదేవిని "నుదుట సిందూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా" అని అడుగుతాడు. సీతమ్మ తల్లి "శ్రీరాముని ఆయుష్షు బాగుండాలని" అంటుంది. అంతే, ఆంజనేయస్వామి తన ఒళ్ళంతా సిందూరం పూసుకుంటాడు. అదీ హనుమంతునికి రాముడి మీద గల నిరుపమానమైన భక్తి. హనుమాన్ జయంతి ఫెస్టివల్ హిందువులకు ముఖ్యమైంది.

చింతలు, చిరాకులు, భయాలు, ఆందోళనలు తీర్చే దేవుడు. ఆంజనేయస్వామి బలానికి, శక్తికి ప్రతిరూపం. కొండను కూడా పెకిలించి తీసికెళ్ళగల శక్తిమాన్ వీర హనుమాన్. ఎక్కువమంది చైత్ర పౌర్ణమి రోజును హనుమాన్ జయంతిగా జరుపుతుండగా కొందరు మాత్రం చైత్ర చతుర్దశిని హనుమాన్ జయంతి గా జరుపుతారు. హనుమాన్ జయంతి ఫెస్టివల్ సెలెబ్రేషన్స్ ను పురస్కరించుకుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హనుమాన్ చాలీసా మొదలైన హనుమంతుని భక్తి గీతాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

హనుమంతుని కధలు వినిపిస్తారు. పంచముఖ హనుమాన్, పాదరస హనుమాన్ తదితర విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. దేవాలయాల్లో హనుమాన్ ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు ప్రసాదాలు పంచుతారు. అనేక దేవాలయాల్లో ఈరోజు అన్నదానాలు నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి ఫెస్టివల్ సెలెబ్రేషన్స్ సందర్భంగా , ఆంజనేయుని ఉంగరాలు, హనుమాన్ లాకెట్లు, హనుమాన్ పిక్చర్స్, ఆంజనేయుని విగ్రహాలు విక్రయిస్తారు. మామూలు రోజుల్లో కంటే, హనుమాన్ జయంతి నాడు ఆంజనేయుని ఉంగరాలు, హనుమాన్ లాకెట్లు, ఆంజనేయుని విగ్రహాలు ఎక్కువగా అమ్ముడుపోతాయి.

Wednesday, April 4, 2012

తెలుగు విలువ తెలుగుదె.డియర్ ఫ్రెండ్స్,
ఇంగ్లీష్ రైమ్స్ ని మనం సరదాగా తెలుగు లో చదువుదామా.జానీ!
జానీ!!
ఏంటి నాన్న,
చక్కర తిన్నావా,
లేదు నాన్న,
అబద్దం చెపుతున్నావా,
లేదు నాన్న,
నూరు తెరువు,
హా హా హా.....


టెక్నాలజీ ఎంత అభివృద్ది చెన్దినా తెలుగు తెలుగే.
తెలుగు విలువ తెలుగుదె.
తెలుగు లో మాట్లాడూదాం.Tuesday, April 3, 2012

నీకు ఎలా తెలపాలి నా ప్రేమ ?


నా మనసు నను వీడి నీ చెంత చేరిందే ఒక క్షణము
అది నువ్వు రుజువు చేయమన్న చాలేనా ఈ యుగము
నీ నీడల్లే విహరిస్తు నా వైపే రాను అంది ఏ క్షణము
నీ జ్ఞాపకాలే శ్వాసగా నీ పిలుపుకై వేచివుంది నా మౌనము

Monday, April 2, 2012

ఓ ప్రియతమా!!!నా ఊహల రాజువి నీవె.
నా కవితల బావం నీవె.
నా కనుల వెలుగు నీవె.
నా జీవిత సర్వస్వం నీవె ఓ ప్రియతమా!!!!!