పేజీలు

Tuesday, July 31, 2012

స్నేహ కావ్యం!


గడిచిన ప్రతీక్షణం ఒక తీపి జ్ఞాపకం...
రాబోయే ప్రతీక్షణం ఒక ఉషోదయం...
ఆ ఉషోదయం వెలుగులా మన స్నేహం అందమైన కావ్యం...
ఇలాగే నిలవాలి మన స్నేహం కలకాలం...

Thursday, July 26, 2012

నిరంతర ప్రయత్నం...ఆకాశాన్ని చేరలేకున్న కెరటాలు అలుపెరుగక ఉవ్వేతున పైకి ఎగిసేను,
మేఘాల గుండె కరిగి ప్రేమతో చిరుజల్లై నింగిని వీడి ఈ కెరటాలను చేరెను,
నీ ఆశ శ్వాస అయిన దాని కోసం అలుపెరుగక ప్రయత్నం కొనసాగించు,
అడవిన వున్నా నీ కొరకు ఆ వెన్నెల వెలుగులు వచ్చి చేరెను...
నీకోసం తడిఆరని కన్నులతో ఎదురుచూస్తున్నాను.....

Saturday, July 21, 2012

నా సర్వస్వం నువ్వే....నేను నీ ముందు నడుస్తున్నపుడు,
నిన్ను రక్షిస్తుంటాను.

నేను నీ ప్రక్కన ఉన్నపుడు,
నీ కొసం ఉంటాను.

నేను నీ వెనుక ఉన్నపుడు,
నిన్ను గమనిస్తూ ఉంటాను.

నేను ఒంటరిగా ఉన్నపుడు,
నీ కోసమే ఆలోచిస్తుంటాను.

నా మధిలో నువ్వే, నా ఆలోచనలో నువ్వే, నా ప్రాణం నువ్వే, నా సర్వస్వం నువ్వే...

Tuesday, July 17, 2012

నా ప్రాణమా.....


నా ప్రాణమా.....

నన్ను నువ్వు నీ కళ్ళల్లో పెట్టుకోకు,
నేను నీ కన్నీరై జారిపోతాను.

నన్ను నువ్వు నీ హ్రుదయంలో పెట్టుకో,
ఎల్లప్పుడు నీ హ్రుదయ స్పందనై ఉంటాను.

అప్పుడు ప్రతీ హ్రుదయ స్పందన నేను నీదాన్ని అని తెలియజేస్తుంది.

Saturday, July 14, 2012

నీతోనే మొదలు.....నా జీవితం అనే కధకు మూలం నీవే.
అది నీ రాకతో మొదలు అవుతుంది.
నీవు వెళ్ళిపోతే ముగుస్తుంది.
అందులో ప్రతి పదము నీవే!
ప్రతి పాటము పేరు నీ పేరే!
ప్రతి వాఖ్యము నీతోనే మొదలు!!!!

Thursday, July 12, 2012

ఎవరికి తెలుసు???


సాగరం ఎంత లోతుందో ఎవరికి తెలుసు?
నేలను తాకి దాగుండె ముత్యపు చిప్పకు  తెలుసు ...

ఆకాషం ఎంత ఎత్తు ఉందో ఎవరికి తెలుసు?
విశ్వానికి వెలుతురునందించే సూర్యకిరణాలకే తెలుసు...

నిప్పు ఎంత వేడిగా ఉంటుందో ఎవరికి తెలుసు?
భగ భగ మండుతున్న జ్వల పర్వతాలకే తెలుసు...

వర్షించే మెఘాని ఆనందం ఎక్కడ ఉందో ఎవరికి తెలుసు?
తొలకరి జల్లుతో స్పర్షించే భుమికి వచ్చే అహ్లదానికే తెలుసు...

ఫ్రియుడి హృదయంలో ప్రేమ ఎంత ఉందో ఎవరికి తెలుసు?
ప్రేయసి మనసులో ఉన్న సంతోషానికే తెలుసు...

ప్రియురాలి సిగ్గు ఎంత అందంగా ఉంటుందో ఎవరికి తెలుసు? 
ప్రియుడి మటల్లోని భావానికే తెలుసు...

నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకెం తెలుసు?
నా జీవితాంతం నిన్ను స్నేహంగా చూసుకునేంత  ప్రేమ ఉంది... 


Tuesday, July 10, 2012

♥♥ నీ ప్రేమ జ్ఞాపకం ♥♥.....


♥♥ ఒకవేల నీకు నేను జ్ఞాపకం వచ్చినట్లైతే,
నీ హ్రుదయన్ని స్పర్శించుకో.
నువ్వు నన్ను వింటవు.
ఒకవేల ఇంకా చాలా చాలా ఎక్కువగా జ్ఞాపకం వచ్చినట్లైతే,
నువ్వు నీ కళ్ళు మూసుకో అప్పుడు నేను నీకు కనిపిస్తాను.

ప్రతిరోజు నువ్వు నా కళ్ళ ముందు ఉన్నట్లే ఉంటావు.
అయినా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను.
ఈ ప్రపంచం మొత్తం నిద్రిస్తున్నా కూడా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను.♥♥

Friday, July 6, 2012

మిత్రమా.....నీకు స్నేహం కావాలంటే,నూరు అడుగులు మన మధ్య ఉంటాయి.
నన్ను చేరుకోవడం కోసం నువ్వు ఒక్క అడుగు ముందుకువేయి,
నేను నీ కోసం 99 అడుగులు ముందుకువేస్తా,
నీ ముందు ఉంటా.
మనం ప్రతీ రోజు ఎన్నో సంపాదించుకుంటాము,
ఎన్నో కొల్పోతాము.
కాని ఒక్క విషయాన్ని నమ్ము.
నేను ఎప్పుడు నిన్ను వదలను.
నీ స్నేహాన్ని కుడా వదలను మిత్రమా.....

Wednesday, July 4, 2012

నా మనసు.....నిను చూసిన ఆ క్షణం నా మనసు నీదైపోయింది.
నువు నన్ను చూసిన మరుక్షణం నా గుండె నీతోటిదే లోకమంటోంది.
నా హృదయం నీ అమాయకపు మోమునీ, అందమైన నవ్వునీ చూసి మురిసిపోతుంది .
నీ రాకతో నా హౄదయం సిగ్గు తో పులకరిస్తుంది
నీ కోసం చుసే ఎదురుచూపులో తీయని ఆనందం దాగివుంది.
నా  హృదయం నిన్ను అందుకోవడానికి ప్రయత్నిస్తుంది.
నీకోసం ఎదురు చూసే నాకోసం రావా...