పేజీలు

Thursday, July 12, 2012

ఎవరికి తెలుసు???


సాగరం ఎంత లోతుందో ఎవరికి తెలుసు?
నేలను తాకి దాగుండె ముత్యపు చిప్పకు  తెలుసు ...

ఆకాషం ఎంత ఎత్తు ఉందో ఎవరికి తెలుసు?
విశ్వానికి వెలుతురునందించే సూర్యకిరణాలకే తెలుసు...

నిప్పు ఎంత వేడిగా ఉంటుందో ఎవరికి తెలుసు?
భగ భగ మండుతున్న జ్వల పర్వతాలకే తెలుసు...

వర్షించే మెఘాని ఆనందం ఎక్కడ ఉందో ఎవరికి తెలుసు?
తొలకరి జల్లుతో స్పర్షించే భుమికి వచ్చే అహ్లదానికే తెలుసు...

ఫ్రియుడి హృదయంలో ప్రేమ ఎంత ఉందో ఎవరికి తెలుసు?
ప్రేయసి మనసులో ఉన్న సంతోషానికే తెలుసు...

ప్రియురాలి సిగ్గు ఎంత అందంగా ఉంటుందో ఎవరికి తెలుసు? 
ప్రియుడి మటల్లోని భావానికే తెలుసు...

నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకెం తెలుసు?
నా జీవితాంతం నిన్ను స్నేహంగా చూసుకునేంత  ప్రేమ ఉంది...