పేజీలు

Monday, February 27, 2012

నా హృదయ వేదన.....


చావు దగ్గరైతే తెలిసొస్తుంది బ్రతుకు తీపి
కానీ,
నువ్వు దూరమైతే నాకు తెలిసొచ్చింది ప్రేమ తీపి 
దూరం మహా చెడ్డదా
లేక 
ఈ ప్రేమ మహా గొప్పదా అని తెలియకున్నది నాకు
మాటలకందని భావాలతో
చేష్టలకందని బావనలతో
నిండి నా హృదయం మూగపోయింది.........

Sunday, February 26, 2012

మిగిలిపోయాను ఇలా...


ఆలోచనలు లేని మదిలా,
ప్రవాహం లేని నదిలా,

శిలకాలేని రాయిలా,
వెన్నల లేని రేయిలా,

పూజకు నోచుకోని పువ్వులా,
పెదవి విడవని నవ్వులా,

తీరం చేరని అలలా,
కాలం చూడని కలలా,
...........మిగిలిపోయాను....

Thursday, February 23, 2012

నీ ఉహలో......


కాటుక కన్నుల మాటున వెన్నెల నీ సొంతం
అలరించే సోయగాల వేణువు నీ స్నేహం
ముద్దులొలుకు పసిపాపను పోలును నీ వైనం
చెప్పలేని అలజడులను కలిగించును నీ మౌనం
సెలయేరుల పరవళ్ళను తలపించును నీ హాసం
చుగురించే మన చెలిమిని మరచిపోకు నా నేస్తం.......    

Sunday, February 19, 2012

మహాశివరాత్రి శుభాకాంక్షలు........


(శివపంచాక్షరీ స్తోత్రం).........
శివాయ గౌరీ వదనాబ్జ భృంగ సూర్యాయ దక్షాధ్వర నాశకాయ
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీకారాయ నమశ్శివాయ|| 


Saturday, February 18, 2012

ఓ ప్రేమ...ఏముంది నీలో ?


ప్రేమ... ప్రేమ... ప్రేమ...
అసలు ఎవరు నీవు ?

ఏముంది నీలో ?

నీవేమైన రూపానివా మరి కనిపించవెందుకో ?
మరి ఎందుకు ఈ భూప్రపంచమంతా  నీ చుట్టే తిరుగుతుంది ?

నీవేమైన బంధానివా, అనుబంధానివా ?
ప్రతి రోజు నీ నా స్మరణే చేస్తుంటాము ఎందుకని ?

నీ ప్రేమలో ఐన్ స్టీన్ కి అందని శక్తి  ఉందా ?
నీలో గెలీలియో గాలలకి కూడా అందని గాడత  ఉందా ?

అణువులు, పరమాణువుల సమ్మేళనం లో 
కంటికి కూడా కనిపించని కణాల మిళితంలో  
అన్ని రకాల భావనలను,
మనసుని కూడా మనుసులో ఇముడ్చుకున్న 
ఆదునిక యుగపు మరయంత్రానివా ?

మరి ఏముంది నీలో ?
ఎందుకింత ఆరాటం  ?


ప్రేమ సమాధానం: నాలో అంతులేని, అంతంలేని ప్రేముంది కాబట్టే దాన్ని అందుకోటానికి మీ ఆరాటం ........♥♥♥

ప్రేమ సంతకం....


మనసు పుస్తకంలో

నీవు చేసిన ప్రేమ సంతకం

ప్రతి క్షణం పరిమళిస్తుంది...

నా ప్రేమ రాక్షసి...!

ఆరని చూపులతో..........

కన్నుల ప్రమిదల్లో ఆశల ఒత్తులు వేని....
ఆరని చూపులతో నేనింక ఎదురు చూస్తున్నది...
రేపటి ఉదయం కోసం కాదు......
నన్ను నన్నుగా ప్రేమించే నీకోసం.......

Friday, February 17, 2012

అందమైన కల.....

అందమైన కల కంటున్నాను
హుష్ నిశబ్దం....
నా కౌగిలిలో తను...
తన కౌగిలిలో నేను..........

నీ స్నేహం.....


నే నడిచిన బాటలో విరిసిన కుసుమం నీ స్నేహం
నే వదిలిన శ్వాసలో పలికిన భావం నీ స్నేహం
నా పయనపు గాయం నీ స్నేహం
నా పలుకుల అర్ధం నీ స్నేహం
నా అడుగుల శబ్దం నీ స్నేహం
నా ఆశల అందం నీ స్నేహం
అలాంటి నీ స్నేహానికి నే దూరం కాలేను
ఆ విరహాన్ని నే భరించలేను.....

కదలలేని కాలం....


కనులు ఉన్నవి కలలు కనడానికి అని అనుకున్నా
నిదుర కూడా పట్టని నాకు కలలు కూడా రావు
కదలలేని కాలం నాలో విరహాన్ని పంచుతుంది
కదులుతున్న సమయం నిన్ను దగ్గర చేస్తుంది ప్రియా.......... 

నీతోనే మొదలు.....నా జీవితం అనే కధకు మూలం నీవే
అది నీ రాకతో మొదలు అవుతుంది
నీవు వెళ్ళిపోతే ముగుస్తుంది
అందులో ప్రతి పదము నీవే!
ప్రతి పాటము పేరు నీ పేరే!
ప్రతి వాఖ్యము నీతోనే మొదలు!!!!

Monday, February 13, 2012

ప్రేమ......

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు......

స్రుష్టి లో తీయని పధం.
మాటలకందని కమ్మని భావం.
కెరటాలు ఎగసిపడే దూరం.
దగ్గరే ఉన్న చేరువ లేని భావం.
హ్రదయానికి చేసే గాయం.
సఫలమైన విఫలమైన చిరకాలం గుర్తుఉండే కమనీయ కావ్యం.

Tuesday, February 7, 2012

ఆఫీస్ లో ఒక రోజునేను రుద్ర్ ఒకే ఆఫీస్ లో జాయ్న్ అయ్యం. కాని వేరే వేరే క్యాబిన్స్.
ముందు తాను ఎవరో కూడా నాకు తెలియదు.
కానీ తర్వాత్ రూద్ర్ నా ప్రాణం అయ్యాడు.
రోజు చూసుకోవడం, అప్పుడపుడు మాట్లాడుకునేవాళ్ళం.
దూరం నూంచ్ నన్ను గమనించేవాడు. ఎక్కువ మాట్లాడే వాడు కాదు.
ఒక రోజు ఆఫీస్ లో రుద్ర్ నాకు ఒక పెన్ డ్రైవ్ కావాలి! నువ్వు కొనుకోని వాస్తావా. అని అడిగా,
ఓకే అని చెప్పాడు. తనే తెస్తాడు అనుకున్న నేను, కానీ నాకు తెలియకుండా వల్ల ఫ్రెండ్ బైక్ తీసుకుని వచ్ఛడు.
నీకోసం మీ ఇంటి ముందు వేట్ చేస్తున్న రా అన్నాడు,  చూస్తే బైక్ పైన రూద్ర్. నేను ఎప్పుడు ఎవరి బైక్ ఎక్కలేదు.
ఇన ఎక్కి వెళ్ళా. ఇద్దరం కలిసి పెన్ డ్రైవ్ తీసుకున్నాం, మళ్లీ నన్ను ఇంటిదగ్గర వదిలేసాడు. అప్పటినుండి ఏదో మాట్లాడం స్టార్ట్ చేశాడు.