పేజీలు

Saturday, July 27, 2013

ఎవరికి సాధ్యం???కన్నులకు రెప్పలు భారమా?
నా కనులతో నీకు లోకాన్ని చూపించడం సాధ్యం..

నింగికి చంద్రుడు భారమా?
నింగిలో చంద్రుడికి చుక్కలను కలబోసి వెన్నెలమ్మను చూపడం నిత్యం..

చెట్టుకి పూవు భారమా?
పూవులకి సుహాసన, మకరందాన్ని కలబోసి వికసించడం ఇస్టం..

మాటలకి భావం భారమా?
భావానికి భాష చేర్చి గుర్తింపునివ్వడం  పరమార్ధం..

నీ హృదయానికి నా మనసు భారమా?
నీ హృదయానికి నా హౄదయాన్ని జోడించి ప్రేమ ప్రపంచం చూపించడం తధ్యం..

నీరాకకై ఎదురుచూపులో నీరీక్షణ భారమా?
ఎదురుచూపులో ఉన్న తీయదనాన్ని ఆస్వాదించడం మనసుకున్న వరం..

విరిగిపోయిన హృదయాన్ని ఒకటి చేయడం ఎవరికి సాధ్యం?
మరి నా మోడుబారిన మనసును ఆనందపరచడం ఎవరికి సాధ్యం??? 

Saturday, July 20, 2013

"ప్రకృతి పారవశ్యం!"


నీలి మబ్బుల చాటున దాగిన చిరు జల్లుల అందం,
కురిసిన జల్లులకు పులకరించిన నేలతల్లి సుమగంధం,
సెలయేళ్ళ గలగల ప్రవాహ పారవస్యం,
పచ్చని చెట్లకు పూసే పూల సుగందం,
కోనేరులో తామర పూలందం, 
పూల మకరంధన్ని తాగే ప్రయత్నంలో కళ్ళనాకట్టుకునే సీతాకోక చిలుకల రంగులందం,
తూనీగల దోబూచులాటల ప్రణయమందం,
వానలో తడుస్తూ హాయిని అనుభవించి రాగాలు తీసే కోకిల స్వరగానం,
చిరుజల్లుకు మయురి నాట్యం చేస్తు పురివిప్పిన అందం అద్బుతం,
నన్ను తడిమిన ప్రతీ చినుకులో మాధుర్యం,
ప్రకృతి ఒడిలో నేను తన్మయం చెందిన వైనం, 
ఇన్ని అందాలను ఆస్వాదిస్తున్న పడుచు సుకుమారమందం, 
వర్ణనాతీతం,సుమధుర అనుభవం...

Happy Rainy Season ...

Friday, July 19, 2013

నేనుంటా నీతోడు!


నీ గెలుపులో నీ సంతోషాన్నవుతా,
నీ ఓటమిలో నీ ఓదార్పునవుతా..

నీ చిరునవ్వులో నీ ఆనందానవుతా,
నీ కన్నీళ్ళలో నీ బాదనవుతా..

నీ నడకలో నీ పాదానవుతా,
నీ చేతిలో గీతనై వందఏళ్ళ నీ జీవితానికి భందానవుతా..

నీ మాటలో మాటనై నలుగురిలో గుర్తింపునవుతా,
నీ దైవారాదనలో భక్తిగా పూజించే పూవునవుతా..

నువ్వు పాడే పాటలో సరిగమల సంగీతానవుతా,
నువ్వు ఆరాదించే నాట్యంలో పాదానవుతా..

నీ శ్వాశలో శ్వాశనై నీ ఊపిరినవుతా,
నీ హృదయం ప్రాణమై జీవితానతం నీతోడు నీడనైనేనుంటా..

Thursday, July 18, 2013

నిన్నేల క్షమించనేల???


ఆదివారము నాడు అలకపూనితే!
సోమవారము నాడు నీసొగసు చూడవస్తానంటివి..

సోమవారము నాడు నీకై ఎదురుచూడగా!
మన్నించు మంగళవారము నాడు నీ మురిపం చుడనొస్తానంటివి..

మంగళవారము నాడు నీకై ఎదురుచూడగా!
మతిమరిస్తి బుదవారం నాడు బుజ్జగించ వస్తానంటివి..

బుదవారం నాడు నీకై ఎదురుచూడగా!
బుద్ది బ్రమించే గురువారం నాడు గుస్సతీర్చడానికివస్తానంటివి..

గురువారం నాడు నీకై ఎదురుచూడగా!
గురకపెట్టి నిద్రపోతిని శుక్రవారం నాడు నీ సింగారంచూడ వస్తానంటివి..

శుక్రవారం నాడు నీకై ఎదురుచూడగా!
చలికి వణికిపోయా శనివారం నాడు సరసమాడ వస్తానంటివి..

శనివారం నాడు నీకై ఎదురుచూడగా!
శనీడ్డంవచ్చే మన్నించు ఆదివారము నాడు అలకతీర్చ వస్తానంటివి..

ఆదివారము పోయి మళ్ళీ ఆదివారము వచ్చే!
నువ్వు మాత్రం రాలేదు..

పో,
పో,
పో,
పో,

నిన్నేల క్షమించనేల???

Wednesday, July 17, 2013

♥♥ హృదయస్పందన ♥♥


నా మనసుకేమయింది ఈవేళ,
స్వర్గం నా కళ్ళముందున్నట్టుంది,
కనురేప్పలమాటున స్వప్నంలో ఎన్నేన్నో ఆశలు దాగినట్టుంది,
నాఉహల ప్రపంచం ఎంతో అందగా మలిచినట్టుంది,
నన్నేవరో మురిపించి మైమరిపించినట్టుంది,
మోహనాంగి అని, సొగసుల సౌందర్యని స్పర్షించినట్టుంది,
తుంటరి వయసులో కంగారుతనాన్ని మెచ్చుకున్నట్టుంది,
నామనసుతో  ఇంకోమనసుతో జతచేసినట్టుంది,
ఏడు రంగులతో వెలిసిన అందమైన హరివిల్లు నేనే అన్నట్టుంది,
సాగరానికి చేరువైన నధిలా ప్రవహించినట్టుంది,
కన్నేపిల్ల మనసు దోచినట్టుంది..
నా హృదయస్పందన ఇంకేలా ఉంటుందోమరి,
ఇదంతా ఏమి మహాత్యం, ఏమి అద్బుతం..

Monday, July 15, 2013

నా పేరంటి??


ముద్దబంతి పూవుల ఉండే భారతినా,
సన్నజాజుల ఉండే సరియునా,
మల్లెపూల ఉండే మృధులనా,
నిర్మలమైన నదిలా ఉండే నర్మదనా,
కిటకిట కంటిచూపుతో కట్టేసే కృష్ణవేణినా,
గలగలా నవ్వే గంగనా,
వయ్యారాల నడకతో వినీతనా,
కిల కిలా అల్లరిపెట్టే కిరణ్మయినా,
తొలివెచ్చని కిరణంలా తాకే ఉదయశ్రీనా,
సూర్యాస్తమయాన్ని తలపిచే సంధ్యనా,
అమాయకమైన ముఖముతో అలరించే అఖిలనా
అందమైనా గులాబిలా గుబాలింపుల రోజానా,
మనసు ప్రశాంతంగా ఉండే ప్రశాంతినా,
వెన్నేల్లో అల్లరిపెట్టే చంద్రబింబాన్ని తలపించే చంద్రలేఖనా,
పసిడి కాంతితో పరవళ్ళు తొక్కే స్వర్ణలతనా,
వాసంత ఋతువులో హాయిగావీచే సమీరనా,
నెమలిలా నాట్యాన్ని తలపించే మయురినా,
అందరినిమెప్పించే అందాల భరణినా,
శ్రీమహాలక్ష్మిని తలపించే సిరినా,
మృధుమధురంలా సాగే శృతిలయల సంగీతాల లహరినా?

మీరైనా చెప్పగలరా?

Monday, July 8, 2013

తెలుగమ్మాయి!!


వేకువఝామున పిల్ల గాలిలా,
ముంగిలిలో ముత్యాల ముగ్గులా,
తొలివెచ్చని సూర్యకిరణంలా,
కిటికిలోంచి తొంగిచూసే మల్లె పరిమళంలా,
బోసినవ్వులొలికించే పసిపాపలా,
నదిలో చిలిపిగా ఆడె చేపపిల్లలా,
గల గలా ప్రవహించే గోదారిలా,
కిలకిల గానంతో కొకిలలా,
తేట తేనెలొలుకు తెలుగు మాటలా,
పడుచందాల పరికినితో,
స్వచ్చమైన మనసులా,
సాయంకాలం సంధ్యలా,
అల్లరి పెట్టే వెన్నెలలా,
కాళ్లకు పారాణితో కింద పెడితే కందిపోయేలా,
నాట్యాన్ని తలపించే చెవిలోలాకులా,
ముత్యమంత ముక్కు పుడకలా,
గలగలమంటు గాజుల సవ్వడిలా,
సిగ్గులొలికే చిరునవ్వులా,
చిటపటలాడే వాన చినుకులా,
ప్రకృతి మత్తులో గుసగుసలాడే సీతాకోక చిలుకలా,

మొత్తం కలబోస్తే తెలుగమ్మాయి!!