పేజీలు

Thursday, August 29, 2013

నా మనసులోని భావం..నీ కన్నుల వెలుగులో శయనించాలని ఉంది,
కాని నా చూపు నిన్ను వెతకడంలో తడబడుతుంది..

నీ అధరాల తీయదనాన్ని ఆస్వాదిన్చాలని ఉంది,
కాని నా  సిగ్గు వద్దొద్దని ఆపుతుంది..

నీ చిరున్నవ్వులోని హాయిలో  రేయి గడపాలని ఉంది,
నీకున్న పరిదిలో నేను నీకు తగునా అని నా మనసు సతమతమవుతుంది..

మధురమైన తేనెల మాటలలో మునుకలు వేయాలని ఉంది,
మౌనం నిన్ను దరిచేరకుండా ఆపుతుంది..

మనసులో భావాలన్ని నీతో పంచుకోవాలని ఉంది,
భావం భాషతో ఏకీభవించక మాటలురాకుండా చేస్తుంది..

నా మనసు నీరాకను గ్రహించి నీచెంతకు ఉరకలు వేయాలని ఉంది,
నాపై నీకున్న భావం ఏమిటో అర్ధంకాక పాదం వెనుకాడుతుంది..

నీతో కలిసి కలకాలం జీవించాలని ఉంది,
ఇవన్ని తెలియకుండా నిన్నెలా అంచన వేయాలో తెలియకుండా ఉంది..