పేజీలు

Thursday, January 9, 2014

♥♥ నీ కోసం వేచివున్నా ♥♥


తొలి మంచుబిందువే నా చెక్కిలిని తాకి మురిసిపోనట్టు,
బొండు మల్లె నావాలుజడను తాకి సిగ్గులొలికినట్టు,

నాకనులే కలగన్న చిత్రము నా కళ్ళముందున్నట్టు,
మైమరిచే సొగసుల పుప్పోడుల అందాలు  కదిలినట్టు,

వీచే చల్లగాలే నా మేనును తాకి ప్రేమ సరాగం నాలో కవ్వించినట్టు,
మదిని దోచిన నా పరువం నీరాకతో మైమరచినట్టు,

తొలి వెన్నేలరేయి నా తనువును తాకి  తన్వయంతో తడిమినట్టు,
అందమైన నా ఊహల్లో నువ్వే చిలిపిగా అల్లరి చేసినట్టు,

మధురమైన నా భావాల్లో కలకాలం గీతమై నిలిచినట్టు,
మనసు పాడె గీతం ప్రణయ రాగం ఆలపించినట్టు,

ఇన్నిన్ని భావాలతో నా సోయగాలు నీకై స్వాగతిస్తూ,
కోటి తారల పున్నమి వెన్నల్లో శృంగార కావ్యాన్నై నీ కోసం వేచిఉన్నా..

Wednesday, January 1, 2014

♥మధురం-మధురం♥

నీలి మబ్బుల చాటున చిరు చినుకుల అందం దాగినట్టు,
నీ గుండెలోతుల్లొ దాగున్న ప్రేమ మధురం.


నిండు వేసవిలో కురిసిన జల్లులకు మధి పులకరించినట్టు,
నన్ను తట్టిలేపే నీఆత్మీయత సుమధురం.


వానజల్లులో తడుస్తూ హాయిని అనుభవించినట్టు,
తేనెలొలికే నీమాటలు మకరంధం.


చిరుజల్లుల ఆనందంతో మయూరం నర్తించినట్టు,
నా పరువం, వయ్యారాలతో నీకు కలిగే సంతోషం అతిమధురం.


వానజల్లు తాకిడితో ప్రకృతి పులకిరిచినట్టు,
నీ స్పర్శకు నామధి ఆనందంతో పులకరించిన వైనం మధురం మధురం.


హరివిల్లు సప్తవర్ణాలతో విలసిల్లినట్టు,
నా మనసు ఆనందపు వర్ణాలతో  నిండిపోవడం ప్రియమధురం..