పేజీలు

Thursday, August 29, 2013

నా మనసులోని భావం..నీ కన్నుల వెలుగులో శయనించాలని ఉంది,
కాని నా చూపు నిన్ను వెతకడంలో తడబడుతుంది..

నీ అధరాల తీయదనాన్ని ఆస్వాదిన్చాలని ఉంది,
కాని నా  సిగ్గు వద్దొద్దని ఆపుతుంది..

నీ చిరున్నవ్వులోని హాయిలో  రేయి గడపాలని ఉంది,
నీకున్న పరిదిలో నేను నీకు తగునా అని నా మనసు సతమతమవుతుంది..

మధురమైన తేనెల మాటలలో మునుకలు వేయాలని ఉంది,
మౌనం నిన్ను దరిచేరకుండా ఆపుతుంది..

మనసులో భావాలన్ని నీతో పంచుకోవాలని ఉంది,
భావం భాషతో ఏకీభవించక మాటలురాకుండా చేస్తుంది..

నా మనసు నీరాకను గ్రహించి నీచెంతకు ఉరకలు వేయాలని ఉంది,
నాపై నీకున్న భావం ఏమిటో అర్ధంకాక పాదం వెనుకాడుతుంది..

నీతో కలిసి కలకాలం జీవించాలని ఉంది,
ఇవన్ని తెలియకుండా నిన్నెలా అంచన వేయాలో తెలియకుండా ఉంది.. 

Thursday, August 22, 2013

నీ తలపులతో !

నిన్ను తలవకుండ నిమిషమైన ఉండాలనుకుంటా,
కాని నువ్వు వదిలి వెళ్ళిన మనసు నాకన్న నిన్నె ఎక్కువగా తలుస్తుంది..

నీ పేరునైనా మరిచిపోదామని పెదవిని మౌనంతో భందిస్తే,
నువ్వు వెలివేసిన హృదయం నీపేరునే గుండె చప్పుడుగా మార్చుకుంది..

నీ రూపానయినా మరిచిపోవాలని కనురెప్పలను అడ్డుపెడితే,
కనుపాప కమ్మని స్వప్నంలొ నిన్ను తలచుకుంది..

నీ జ్ఞాపకాలనైన మరచిపోవాలని కన్నీటిని వదిలేసే,
కన్నీరు హృదయపుటంలొ కవితలా అళ్ళుకుంది..

నిన్ను తలవకుండా నిమిషమైన ఉండలేనని తెలిసి,
నాకు నేనె దూరమవుతున్నా..

నమ్ముతావా? అరిచేతుల్లో ప్రాణం పెట్టుకొని,
నువ్వు నాతోనే ఉన్నావన్న భావంతో జీవిస్తున్నాను..