పేజీలు

Thursday, February 23, 2012

నీ ఉహలో......


కాటుక కన్నుల మాటున వెన్నెల నీ సొంతం
అలరించే సోయగాల వేణువు నీ స్నేహం
ముద్దులొలుకు పసిపాపను పోలును నీ వైనం
చెప్పలేని అలజడులను కలిగించును నీ మౌనం
సెలయేరుల పరవళ్ళను తలపించును నీ హాసం
చుగురించే మన చెలిమిని మరచిపోకు నా నేస్తం.......