పేజీలు

Thursday, June 7, 2012

నా ఆలొచన నువ్వే ..


ప్రతి ఉదయం కల్లుతెరిచి,
సూర్యోదయాన్ని చూసేముందు,
నా ఆలొచన నువ్వే ..

ప్రతి ఉదయం
సూర్యోదయంలోని వెచ్చదన్నాని ఆస్వాదిస్తున్నపుడు
నా ఆలొచన నువ్వే ..

వసంత ఋతువులో మొదటి రోజు
పక్షుల రాగాలు వింటున్నపుడు
నా ఆలొచన నువ్వే ..

మొక్కల పొద్దల్లో దాగివున్న
రోజా పువ్వు ను చూస్తున్నపుడు
నా ఆలొచన నువ్వే ..

సాగరతీరం లో
అలల సవ్వడిని వింటున్నపుడు
నా ఆలొచన నువ్వే ..

అందమైన మరో ప్రపంచం లాంటి
రంగుల హరివిల్లును చూస్తున్నపుడు
నా ఆలొచన నువ్వే ..