పేజీలు

Saturday, November 24, 2012

ఒంటరి బ్రతుకు!...


జ్ఞాపకాల అడుగిడిన ఒక మడతని విప్పితే,ఆశ్చర్యమో? అహ్లాదమో?
నిన్ను ప్రేమించిన నా మనసు ఎగతాలిగా నవ్వినట్టు అనిపించింది.
మరల తడిమి చూస్తే భాదతో నలిగినట్టు కనిపించింది.
ఎక్కడో దాగి ఉన్న దుఖ్ఖం కళ్ళల్లో పెళ్ళుబికింది.
నవ్వు లేని పెదాలతో జీవం లేని బ్రతుకులా అనిపించింది.
నాకు నేనుగా వేసుకున్న బందాలు మనసుకి సంకెళ్ళులా అనిపించాయి.
నువ్వు లేకుండా నాకు ఒంటరి బ్రతుకు అనిపించింది.
మరల మడత పెడుతుంటే కను చివర కన్నీటి ముత్యం మెరిసినట్టే మెరిసి చీకటిలో కలిసిపోయింది!...