పేజీలు

Thursday, August 22, 2013

నీ తలపులతో !

నిన్ను తలవకుండ నిమిషమైన ఉండాలనుకుంటా,
కాని నువ్వు వదిలి వెళ్ళిన మనసు నాకన్న నిన్నె ఎక్కువగా తలుస్తుంది..

నీ పేరునైనా మరిచిపోదామని పెదవిని మౌనంతో భందిస్తే,
నువ్వు వెలివేసిన హృదయం నీపేరునే గుండె చప్పుడుగా మార్చుకుంది..

నీ రూపానయినా మరిచిపోవాలని కనురెప్పలను అడ్డుపెడితే,
కనుపాప కమ్మని స్వప్నంలొ నిన్ను తలచుకుంది..

నీ జ్ఞాపకాలనైన మరచిపోవాలని కన్నీటిని వదిలేసే,
కన్నీరు హృదయపుటంలొ కవితలా అళ్ళుకుంది..

నిన్ను తలవకుండా నిమిషమైన ఉండలేనని తెలిసి,
నాకు నేనె దూరమవుతున్నా..

నమ్ముతావా? అరిచేతుల్లో ప్రాణం పెట్టుకొని,
నువ్వు నాతోనే ఉన్నావన్న భావంతో జీవిస్తున్నాను..

14 comments :

 1. gathamulo migilina nee thalapunu kalalai marujanma etthane nannu allukoni.... annatuga aa chitramu entho bagundhi dhaaniki thodu aksharalu kaadhu kaadhandoi thalapulu ... :) :)

  ReplyDelete
  Replies
  1. కళ్యాన్ గారు మీ అత్మీయపూరితమైన అభినందనకు ధన్యవాదాలు.:-))

   Delete
 2. అన్ని భావాలు సమానంగా ఒదిగిపోయిన ఓ చల్లని కావ్య కుసుమం మా ముందు ఉంచారు శృతి గారు. ఇలా మరిచిపోవాలనుకున్న మరుపు రానిదే నిజమైన ప్రేమ యొక్క లక్షణం. ఏమైనా మీ సమయస్పూర్తికి మీ భాషా ప్రయోగం నిజ్జంగా మిమ్మల్ని ఎంతో పొగడాలని ఉంది.

  భావాన్ని అక్షరం లో మార్చాలంటే చాలా బుద్ధి కౌసల్యత ఉండాలి. అది మీలో మెండుగా ఉంది. కీప్ ఇట్ అప్.

  నిన్నటి వరకు పాటకే శృతి ఉంటుందనుకున్న .. ఇవాళ్ళ మీ కవితతో మాటలో కూడా శృతి ఉంటుందన్న విషయాన్నీ కనుగొన్నాను.

  శ్రీధర్ భూక్య

  మీకు వీలుంటే నా కావ్యమాలికను కూడా సందర్శించండి.
  http://kaavyaanjali.blogspot.in/
  Regards,
  Sridhar Bukya

  ReplyDelete
  Replies
  1. శ్రీధర్ గారు మీరు మరీ ఎక్కువగా పొగిడేసున్నారు:-)) నచినందుకు ధన్యవాదాలు:-))

   Delete
  2. అయ్యొ శృతి గారు, ఉన్న మాటే అన్నను నన్ను నమ్మండి.. పొగడలేదు సుమా :-)

   Delete
 3. నీ రూపానయినా మరిచిపోవాలని కనురెప్పలను అడ్డుపెడితే,
  కనుపాప కమ్మని స్వప్నంలొ నిన్ను తలచుకుంది..Nice feel

  ReplyDelete
  Replies
  1. పద్మార్పిత గారు నచ్చినందుకు ధన్యవాదాలు:-))

   Delete
 4. Replies
  1. అనికేత్ గారు నచ్చినందుకు ధన్యవాదాలు:-))

   Delete
 5. చాల మంచి ఫీల్ తో చాల చక్కగా రాసరండి. బాగుంది :)

  ReplyDelete
  Replies
  1. నా ఫీల్ నచ్చినందుకు ధన్యవాదాలు ప్రియగారు:-))

   Delete
 6. కాని నువ్వు వదిలి వెళ్ళిన మనసు నాకన్న నిన్నె ఎక్కువగా తలుస్తుంది..

  enti naa manasu ninnu vadili vellinadaa...? ala jarigite nenu ee prapanchamlo undagalana priyaa......????

  నమ్ముతావా? అరిచేతుల్లో ప్రాణం పెట్టుకొని,
  నువ్వు నాతోనే ఉన్నావన్న భావంతో జీవిస్తున్నాను.. antunnavu kada..
  mari nenu ni prakkana unnappudu enduku matalu raavadam ledu, naa feelings ni enduku anagadokkestunnavu, nenu nee vaadini kaada? cheppu priyaa cheppu?? ilaanti pedda pedda maatalatho naa manasu champaku priyaa......... nenu pettina ee comment display avvali, delete cheysavo chudu.........

  ReplyDelete
 7. nee mind enduku upset avutundi, mana madhya pedda godava ayinappudu kuda ila maatladaledu, but ippudippude ante oke ayye time lo nuvvu ila matladite nenu tattukolenu janu.....

  ReplyDelete