పేజీలు

Thursday, June 28, 2012

ఆనందం....నింగికి జాబిలి తో ఆనందం.
నేలకి తొలి చినుకుతో ఆనందం.
హరివిల్లుకి రంగులతో ఆనందం.
కొమ్మకి పువ్వుతో ఆనందం.
ప్రకృతికి పచ్చదనంతో ఆనందం.
నెమలికి నాట్యంతో ఆనందం.
కోకిలకి గానంతో ఆనందం.
తల్లికి బిడ్డతో ఆనందం.
నా మనసుకి నీ చిరునవ్వుతో ఆనందం...

Wednesday, June 27, 2012

నీ స్నేహం....


నిజమైన స్నేహితులు అందమైన ఉదయం లాంటివాళ్ళు .
వాళ్ళు నీతో రోజు మొత్తం ఉండరు,
కాని నిజం ఏంటి అంటే ,
అందమైన సుర్యోదయంలా,
వాళ్ళు మరుసటి రోజు ఉదయమే మీ ముందు ఉంటారు.
ప్రతీ రోజు,
జీవితాంతం ఉంటారు......

Tuesday, June 26, 2012

నీ ప్రేమ కోసం .....


కవ్వించే నీ కళ్ళు చూసి నా కళ్ళు అయ్యాయి కలల మయం,
వికసించే నీ చిరునవ్వు చూసి నా హృదయం అయ్యింది నీకు దాసోహం,
క్షణమయినా కునుకు రానీయదు కన్నుల్లో నీ రూపం,
ఏక నీ తలపుతోనే నా మనస్సు వుంది.
నీ ప్రేమ కోసమే నా తనువూ వుంది...

Saturday, June 23, 2012

సీతాకోక చిలుక...

ప్రేమ అనేది  సీతాకోక చిలుక లాంటిది....  
ఎంత దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినా అంత ఎక్కువ పరుగులు తీస్తుంది.
కాని దాన్ని ఆనందంగా విహరించే స్వేచ్చనిచ్చి.
నువ్వు ఒక అందమైన పువ్వులా ఉండు
అదే నీ దగ్గరకి వస్తుంది.
ప్రేమ అనేది చాల సంతోషాన్ని ఇస్తుంది, 
కాని అదే బాదని కుడా  ఇస్తుంది,
కాని ప్రేమ అనెది ఎప్పుదు ప్రత్యేకమే, 
అది ఎదుటి వాళ్ళకు పంచినపుడు.
ఎదుటి వాళ్ళ సంతోషాన్ని చుసినప్పుడు. 

ఐతే ప్రేమించమని బలవంత పెట్టకు,
బలవంతంగా సంపాదించుకునే ప్రేమ ఎక్కువ కాలం నిలవదు.
మన ఈ ప్రేమ సీతాకోక చిలుకకు ఎప్పుడు స్వేచ్చనిద్దాం......

Friday, June 22, 2012

అది నువ్వే...నెలలు 12
క్రికెట్ ఆటగళ్ళు 11
చెతి వేళ్లు 10
గ్రహాలు 9
ములాలు 8
అద్బుతాలు 7
జ్ఞానేంద్రియాలు 6
సముద్రాలు 5
దిక్కులు 4
కాలాలు 3
కళ్ళు 2
ప్రేమించే వ్యక్తి 1
అది నువ్వే........

Tuesday, June 19, 2012

జన్మదిన శుభాకాంక్షలు......


ఆ బ్రహ్మ పరవసించి ఈ చిన్ని కృష్ణున్ని భువికి పంపిన రోజు.
తన్మయత్వంతో ఇంటిల్లపాది ఆనందంలో ఓలలాడిన రోజు.
నీ చిట్టి చిట్టి అడుగులతో ఇంటిని బృందావనం లా మార్చిన రోజు.
ఆకాషం లో హరివిల్లు అందంగా వికసించి అలరించిన రోజు.
నెలరాజుని చూసి కోయిల ఆనందంతో రాగం పాడిన రోజు .
నాట్యమయూరి అయిన నెమలి ఆనందం తో పరవషించిన  రోజు.
అందుకో నా  హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ నీ పుట్టిన రోజు.


 నా మిత్రులారా ఈ రోజు నా రుద్ర్  పుట్టినరోజు  అందరు విషెస్ చెప్పండి ప్లీస్......

Monday, June 18, 2012

నీ జ్ఞాపకమే....


నువ్వు గుర్తుకొస్తే చాలు
నాలో ఎమీ ఉండదు నీ జ్ఞాపకం తప్ప
నా నిన్న నాకు గుర్తుకురాదు
నా రేపుకై తొంగిచూసే ఆశ ఉండదు
నా నిన్నకి,నేటికి మద్యన వంతెన దూరమైంది
ఈ క్షణం శాశ్వత మైపోయింది
నువ్వు నాతో ఉంటే చాలు
నాలో నేనుండను, అంతా నువ్వు నీ జ్ఞాపకమే.

Friday, June 15, 2012

క్షణ క్షణం నిరీక్షణ.....


క్షణ క్షణం అనుక్షణం నిరీక్షణం
నీకోసం ఈ ఆవేశం
ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఇన్నాళ్ళుగా
ఎదురుచూసి అలసి సొలసి సొమ్మసిల్లి
పడిపోయా !
తర తరాలు యుగ యుగాలు
వత్సరాలు గడిచిన
మరువరాని మరపురాని క్షణాలను
తలచి తలచి దుఖిస్తూ
నిర్జీవమైన దేహంతో
అంతులేని అనంతమైన
శూన్యంలో రెప్పపాటు
దుఖంతో
మూలుగుతూ మ్రుక్కుతూ
నీకోసం ఆలోచిస్తూ అన్వేషిస్తూ
నిరీక్షిస్తూ నిట్టుర్పు విడుస్తూ
భాధతో వ్యధతో నీకోసం................................- ......................క్షణ క్షణం

Wednesday, June 13, 2012

ప్రియతమా.....


భూమి గుండ్రంగా తిరగడం ఆగిపోయినా,
పక్షులు ఆకాషం లో విహరించడం ఆపేసినా,
నెమలి నాట్యం మరచినా,
క్రొవ్వొత్తి వేడి కి కరగడం ఆగిపొయినా,
చేపలు నీళ్ళల్లో ఈత కొట్టడం మానేసినా,
హ్రుదయం ఊపిరి పిల్చడం ఆపెసినా,
కాని నేనెప్పుడు నిన్ను మరవను ప్రియతమా...

Monday, June 11, 2012

నీ స్నేహం.....


మీకు తెలుసా  మీ రెండు కళ్ళ మధ్య ఉన్న సంబందం?  
అవి రెండు కలిసి రెప్పలు అందంగా వాలుస్తాయి...
అవి రెండు కలిసి గుండ్రంగా  తిరుగుతాయి...
అవి రెండు  కలిసి ఏడుస్తాయి...
అవి రెండు  కలిసి చూస్తాయి...
అవి రెండు  కలిసి నిద్రిస్తాయీ...
ఐనా అవి రెండు కలిసి ఒకదానికి ఒకటి చూసుకోలేవు ఎప్పటికి...
అలగే స్నేహం కుడా అంతే,
నీ స్నేహం లేకుండా నా జీవితం వ్రుదా...
నా జీవితాంతం నీ స్నేహం కావాలి మిత్రమా...

Friday, June 8, 2012

చిన్ని ఆశ....


నీ నవ్వు చూడాలని ఆశ.
నీ నవ్వు వినాలని ఆశ.
నీ కళ్ళల్లోకి చూడాలని ఆశ  .
నీ స్వరం వినాలని ఆశ .
నీ ప్రక్కన ఉండాలని ఆశ.
నీ చేయిలో చేయి వేయాలని ఆశ .
నువ్వు నన్ను ప్రేమించాలని ఆశ....

Thursday, June 7, 2012

నా ఆలొచన నువ్వే ..


ప్రతి ఉదయం కల్లుతెరిచి,
సూర్యోదయాన్ని చూసేముందు,
నా ఆలొచన నువ్వే ..

ప్రతి ఉదయం
సూర్యోదయంలోని వెచ్చదన్నాని ఆస్వాదిస్తున్నపుడు
నా ఆలొచన నువ్వే ..

వసంత ఋతువులో మొదటి రోజు
పక్షుల రాగాలు వింటున్నపుడు
నా ఆలొచన నువ్వే ..

మొక్కల పొద్దల్లో దాగివున్న
రోజా పువ్వు ను చూస్తున్నపుడు
నా ఆలొచన నువ్వే ..

సాగరతీరం లో
అలల సవ్వడిని వింటున్నపుడు
నా ఆలొచన నువ్వే ..

అందమైన మరో ప్రపంచం లాంటి
రంగుల హరివిల్లును చూస్తున్నపుడు
నా ఆలొచన నువ్వే ..

Sunday, June 3, 2012

జీవితం...


మన జీవితం ప్రేమించదం నేర్పిస్తుంది.   
మన జీవితం కన్నీళ్ళు అంటే ఎంటో నేర్పిస్తుంది.
ఇదంతా నమ్మసక్యం కాని నిజం కావచ్చు.   
కాని అదే నిజం.
కన్నీళ్ళ విలువ తెలియనంత వరకు,
ప్రేమ విలువ కూడ మనకు తెలియదు....