పేజీలు

Saturday, June 22, 2013

♥♥ నువ్వు నేను ♥♥




నువ్వు నిదురపోతున్నపుడు, నీస్వప్నాన్ని పంపు!.
నా స్వప్నాన్ని పంపుతున్నాను, నీకన్నుల్లో దాచుకో!.

నువ్వు నవ్వుతున్నప్పుడు, నీసంతోషాన్ని పంపు!.
నా సంతోషాన్ని పంపుతున్నను, నీపెదవిలో చేర్చుకో!.

నువ్వు బాదగా ఉన్నపుడు, నీకన్నీటిని పంపు!.
నా కన్నీలను పంపుతున్నాను, నీఓదార్పుతో ఆవిరిగా మర్చుకో!.

నన్ను తలుచుకుంటూ, నీలో ఉన్న నా మనసును రాగాన్ని పంపు!.
నా మనసు రాగాన్ని పంపుతున్నాను, నీలోని నామనసుతో పంచుకో!.

నీ చేతికి నా  చేయందిస్తున్నాను, ప్రేమగా చూసుకో!.
నువ్వు నేను అనే బావాన్ని వదిలి మనం అన్న ప్రేమతో మెలుగుదాము!...



Saturday, June 15, 2013

నీకు తెలుసు!..


నను ఎప్పటికి కలవలేవని తెలుసు,
తెలిసి కూడా నాతో మాటలు కలిపావు!...

నన్ను ఎప్పటికైన ఏడిపిస్తావని తెలుసు,
తెలిసి కూడా నన్ను  నవ్వించావు!...

నన్ను ఎప్పటికి తాకలేవని తెలుసు,
తెలిసి కూడా నన్ను కవ్వించావు!...

నాలో ఎప్పడికి కలవలేనని తెలుసు,
తెలిసి కూడా నాతో ప్రణయ ప్రయాణం సాగించావు!...

నాకు దూరం ఆవుతావని తెలుసు,
తెలిసి కూడా ప్రేమించావు!...

నా కన్నీళ్ళను నీకు తెలియకుండా దాచేస్తున్నానని తెలిసు,
తెలిసికూడా గమనిచక దాటెస్తావు!...

అనుకోకుండా  ప్రేమించావు,
తెలిసి తెలిసి దూరమవ్వుతున్నావు!...

ఇన్ని తెలిసిన నీకు,
నేను ఎలా ఉంటే సంతోషంగా ఉంటానో తెలియదా???
జీవితం ప్రశ్నలా మార్చొద్దు..

Thursday, June 6, 2013

కోపమా లేక అందమా?


స రి గ మ ప ద ని స అంటు సంగీతంతో,
మయూర నాట్యల నృత్యంతో,
గల గల మంటు గోదారిలా పరవళ్ళ వలపుతో,
బిర బిర మంటు కృష్ణమ్మలా చిలిపి అల్లర్లతో,
చందమామ లాంటి చక్కని మోముతో,
కిల కిల మంటు పడుచు నవ్వులతో,
చూడ చక్కని వయ్యారంతో,
సన్నజాజుల గుస గుసలతో,
అన్నింటికన్న మించి మంచి మనసుతో,
గుస గుస మంటు కోపంతో,
మరి బుంగ మూతితో ఎందుకంత కోపం!!!
నీ గురించి వర్ణిచడం కష్టం....

కోపంలో కూడ ఎంత అందంగా ఉన్నవో!...

Tuesday, June 4, 2013

♥♥ మనసంతా నీకే ♥♥


వెండి వెన్నెల జాబిలి నేనైతే!!
నాకు వెలుగునిచ్చే చంద్రుడు నీవ్వే!!!

సాగరంలో అలని నేనైతే!!
నన్నాడించే సముద్రుడు నీవ్వే!!!

భూలోకానికి వెలుగునిచ్చే కిరణం నేనైతే!!
నాకు శక్తినిచ్చే సూరుడు నీవ్వే!!!

పొగ మంచులో హాయిని రేపే కలవరం నేనైతే!!
ఆ కలవరాన్ని తీర్చే అందం నీవ్వే!!!

క్రిష్ణుడికి గోపికలెంతమందైన!!
ప్రేమను పంచే రాధను నేనొక్కదానే!!!

నీ మనసుకి ఎవరు నచ్చినా!!
నా మనసంతా నీకే!!!
నీకు మాత్రమే సొంతం!!!  

Saturday, June 1, 2013

అనుకోలేదు ఏనాడు!

నేను అనుకోలేదు ఏనాడు!
ఇలా మీతో
గల గలా మట్లాడతానని!
స్నేహాన్ని పెంచుకుంటానని!
నా సంతోషాన్ని పంచుకుంటానని!
నేను ఒక బ్లాగ్ చేస్తానని!
నా బ్లాగ్ ముచ్చట్లు మీతో చెప్పుకుంటానని!
నా బ్లాగ్ లో 100 పోస్ట్లు పూర్తి చేసుకుంటానని!
అనుకోలేదు ఏనాడు!

మీ అందరికి నా నమసుమాంజలి!
ఇదే నా స్వాగతాంజలి!
మీ తెలుగమ్మయికి ఎప్పటికి,
మీ ఆధరన అభిమానం నాతో ఉండాలని కోరుకుంటు!

                                                                              మీ 
                                                                        ♥♥ శృతి ♥♥...


Friday, May 31, 2013

నాకెన్నెన్ని ఆశలో!


సరిహధ్దులే లేని ఆ నీలాకాశంలో
స్వేచ్చగా పక్షినై ఎగరాలనుంది!

తపొప్పులే ఎరుగని పసితనానికి
మరల నాకు పయనమవ్వాలని వుంది!

సమాజ అసమానతలకు తావులేని
సామ్రాజ్యానికి నెనో యువరాణినవ్వాలని వుంది

మమతానురాగాలకు విలువనిచ్చే
మనషుల మధ్య అనునిత్యం వుండాలనుంది!

మషుల మధ్య అందమైన సంబంధాని పంచే
ప్రేమతత్వాన్ని తెలిపే అందమైన కవితనవ్వాలనుంది!

"నేను" "నా"అనే ఆలోచనేలేని
"మన" అనే భాధ్యతల్లొ ఆనందం పొందాలని వుంది!

అయ్యో ఇదంతా కలా!

Thursday, May 30, 2013

అలా అననేల???

రమణీయం, కమనీయం నీ దరహాసమనెను!
అనిర్వచనీయం అద్బుతం నీ రూపమనెను!
నాట్య మయూరం నీ నడకనెను!
కడలి జలపాతం నీ వయ్యారమనెను!
మధురం నీ నామమనెను!
కదిలే ఓ వెండి వెన్నెల నీ చాయనెను!
అందానికే వన్నె తెచ్చిన  కుందంపుబొమ్మవనెను!
కోకిల గానం నీ నీపలుకనెను!
ఈలోకంలో నీ చిరునామా ఎక్కడనెను!

చివరకి నేను కనిపించగానే

అందాల రాక్షసి అననేల???

Wednesday, May 29, 2013

చిలిపి జ్ఞాపకాలతో!!

వాలు కళ్ళ వయ్యారాల చూపుతో,
నుదుటిన  కుంకుమ బొట్టుతో,
సుందరమైన హంస నడకతో,
వాలు జడలో మల్లెల గుబాలింపుతో,
తెలుగందాల పట్టు పావడాతో,
సుగంధాలు ఒలికిపొయే సోయగంతో,
ముద్దమనోహరమైన రూపు లావన్యముతో,
తేనేలోలుకే చిలిపి మాటల తీయధనముతో,
బుట్టబొమ్మలా అందంగా ముస్తాబయ్యి,
కవ్వించే కోరికల కంగారుతో,
మైమరపించే నా సప్తస్వరాల సంగీత గానంతో,
జన్మజన్మలకి నీ కౌగిలిలో వోదిగిపోయే చిలిపి స్పర్శ జ్ఞాపకాలతో,
నీ ఉహల పరధ్యానంతో,
నీకై ఎదురు చూపులతో ఇంకెన్నాలిల ఉండను మరి???

Tuesday, March 26, 2013

నీ చిరునవ్వు జ్ఞాపకాలతో...


మాట్టాడటంలేదు అనుకుంటే మౌనమే చాలు అనుకున్నాను!.
నువ్వు మౌనంగా ఉన్నావంటే నేను సహనంగా ఉండాలనుకున్నను!.
కలవడం లేదు అనుకుంటే కళ్ళల్లోనే ఉన్నాననుకున్నాను!.
చేతల్లో చికాకు చూసి మనసులోనే ఉన్నాననుకున్నాను!.
నీ జ్ఞాపకాలతో,
నీకై ఎదురుచూపులతో,
ఆశతో బ్రతుకుతున్నాను!..
నన్ను మరచిన నీచిరునవ్వు జ్ఞాపకాలతో కాలం గడుపుతున్నా!...

Saturday, February 2, 2013

ఏమని చెప్పను?

నలుగురిలో నేను ఉన్నపుడు,
పదేపదే నువ్వు గుర్తుకొచ్చినపుడు,
దిగులుతో మనసు బరువెక్కినపుడు,
మాట్లాడేందుకు మాటలు రానపుడు,
ఏమయిందని అందరు అడిగినపుడు,
ఎంచెప్పాలో తెలియక తడబడుతున్నపుడు,
నా అవస్థ నాకే నవ్వు తెప్పించినపుడు,
ఆనవ్వు నీతో పంచుకోవాలనిపించినపుడు,
ఎంత వెతికిన నువ్వు కనిపించనపుడు,
అది నీ జ్ఞాపకమని నాకు అనిపించినపుడు,
నా కన్నీళ్ళను ఆపేందుకు ప్రయత్నిచినపుడు,
నా కళ్ళల్లో  కన్నీరు ఆగనపుడు,
నా మనసుపడే వేదన నీకేమని చెప్పను???
గుండె బరువై,
మనసులో గుబులై,
మమత కరువై,
నీ ప్రేమ దూరమై,
ఇంకేమని చెప్పను..
ఎలా బ్రతకను...

Wednesday, January 23, 2013

ప్రేమంటే!!!

వర్షంలో ఒకే ఒక్క గొడుగులో నడిచిన
మన పాదాల అడుగులకు తెలుసు ప్రేమంటే!

మేఘల ఘర్షణ లో ఉరుముల మెఱుపుకు
కలిసిన మన కనులకు తెలుసు ప్రేమంటే!

కంటి సైగతో పలకరిస్తే బదులు పలికే
చిరునవ్వుకు తెలుసు ప్రేమంటే!

మమత నిండిన నీచేతి స్పర్శతో
స్పందించే నామదికి తెలుసు ప్రేమంటే!

మల్లే, సన్నజాజి పూల పరిమళానికి
నిన్ను ఆకర్షిచే మైకానికి తెలుసు  ప్రేమంటే!

కలలు నిజమై మన మనసులు ఒక్కటై
మమతానురాగానికి తెలుసు ప్రేమంటె!

అల్లిబిల్లి కబుర్లతో, చిలిపి సరసాలతో
నన్ను ఆట పట్టించే, అమాయకత్వానికి తెలుసు ప్రేమంటే!

నా ఆశ, శ్వాశ, తల్లి, తండ్రి, ప్రాణం నీవై
నన్ను ప్రాణంగా చూసుకునే స్నేహానికి తెలుసు ప్రేమంటే!

మన ఇరువురి మధ్య ప్రణయమై
కలసిపోయే మన హృదయనికి తెలుసు ప్రేమంటే!

Thursday, January 17, 2013

ఎవ్వరో, నీవెవ్వరో?

మబ్బుల చాటున చంద్రుడివా?
మల్లెపూలతో మంచెం వేస్తా...

మిల మిల జిలుగుల వెలుగుల నెలరాజువా?
మధిలో ప్రేమతో మందిరం కడతా...

మధువుల తేనెల పలుకుల చిలిపి క్రిష్ణుడివా?
ఫ్రియసఖి రాధనై ప్రేమను పంచుతా...

ప్రేమను పంచే ప్రియసఖుడివా?
నీ ప్రేమకు నేను దాసోహం అవుతా...

ఇంతకి  నీవెవ్వరో???
నీ రాకకై, నీకై ఎదురుచూపులతో.. శృతి...

Saturday, January 12, 2013

సంక్రాంతి శుభాకాంక్షలు...





రంగు రంగుల హరివిల్లు,
ముత్యాల ముగ్గులు,
రత్నాల గొబ్బెమ్మలు,
తీయటి చెరుకు గడలు,
పిండి వంటలు...






కూతుర్ల సిగ్గుమొగ్గలు,
కొత్త అళ్ళుల్ల సందడులు,
బావా మరదళ్ళ సరదాలు,
గంగిరెద్దుల గలగలలు,
హరిదాసు తంబుర నాదాలు...




గాలిపటాల రెపరెపలు,
ధాన్యపు రాశుల లోగిళ్లు,
పసిపిల్లల బోసినవ్వులు,
మీ ఇళ్ళు, వాకిళ్లు కిలకిలలాడాలని,
మీ శృతి స్వాగతం పలుకుతూ...



నిత్యం ఆ సంక్రాంతి లక్ష్మి కరుణ కటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటూ,
ఈ సంక్రాంతి మీ అందరికి బోగభాగ్యాలనివ్వాలని,
తెలుగు వారందరికి,
నా బ్లాగ్ మిత్రులందరికి,
సంక్రాంతి శుభాకాంక్షలు...

Saturday, January 5, 2013

ఒక చిన్న మాట, ఇది న్యామంటావా....

తలంటు స్నానంపోసి ,
కళ్ళకు ఐటెక్స్ కాటుక పెట్టి,
నుదుటిన సింగార్ బొట్టు పెట్టి,
ముక్కున బంగారు పుడక పెట్టి,
మెడలోన వజ్రాల హారం వేసి,
నడుముకు వడ్డనం పెట్టి
జడగంటలు జడలు కట్టి,
మల్లేపూలు జడలో తురిమి,
కాల్లకు పట్టిలు తొడిగి,
పట్టంచు చీరకట్టి,
చిన్నంచు రవిక తొడిగి,
వళ్ళంతా సెంటుకొట్టి,
మేనంతా సింగారిచి,
నీకోసం ఎదురుచూస్తూ పరధ్యనంలో నేనుంటే,
నువ్వొచ్చావని తలుపుదగ్గరికి,
వయ్యారంగా నడిచి వస్తుంటే,
అలా నన్ను చుడగానే,
నీ మీసం మెలేసి,
నా జడ లాగి,
నా కొంగు లాగి,
నడుమొంపు అందాలను స్పర్షించి,
నీ కౌగిలిలో బిగించి,
నా పెదవంచు అందాలను అందుకోని,
ఇంకా ఎదేదో కావాలంటు,
ఇలా ఉక్కిరి బిక్కిరి చేయడం న్యామంటావా....

చిపో నాకు సిగ్గు.....

Tuesday, January 1, 2013

నా పరువం నీకోసం!.. నీకేసొంతం ♥♥...


ఓ నా చిలిపి బావ!

అలిగావా?
నాకోసం రమ్మంటే రానంటావా?
సరసమాడరమ్మంటే కుదరంటావా?
నీ చిత్రాంగి మరదలిమీద కోపం తగునంటావా?
నా ఓరచూపు నీకు సోకకుండా ఉండడం న్యాయమంటావా?
తాపంతో రగులుతుంటే అలిగానని అంటావా?

నా పాలరాతి వంతి మేము,
ఎరుపెక్కిన చెక్కిళ్ళు,
కోటేరు ముక్కు,
ఎరుపెక్కిన పెదాలు,
నీకేసొంతం...

నా హంస నడక,
నడుమొంపు సొగసు,
లేలేతని సొగసు,
తడి ఆరని అందాలు,
నీకేసొంతం...

వాటన్నింటికి మించి,
నా పరువం,
నా చిరునవ్వు,
మా చిలిపితనం,
నా అమాయకత్వం,
నా స్నేహం,
నా ప్రేమ,
నా ప్రాణం,
నీకేసొంతం...

ఇన్ని చెప్పినా రానటావా???
♥♥ ఇప్పుడు కొండదిగవా ♥♥
♥.....
♥♥.....