పేజీలు

Saturday, February 18, 2012

ఓ ప్రేమ...ఏముంది నీలో ?


ప్రేమ... ప్రేమ... ప్రేమ...
అసలు ఎవరు నీవు ?

ఏముంది నీలో ?

నీవేమైన రూపానివా మరి కనిపించవెందుకో ?
మరి ఎందుకు ఈ భూప్రపంచమంతా  నీ చుట్టే తిరుగుతుంది ?

నీవేమైన బంధానివా, అనుబంధానివా ?
ప్రతి రోజు నీ నా స్మరణే చేస్తుంటాము ఎందుకని ?

నీ ప్రేమలో ఐన్ స్టీన్ కి అందని శక్తి  ఉందా ?
నీలో గెలీలియో గాలలకి కూడా అందని గాడత  ఉందా ?

అణువులు, పరమాణువుల సమ్మేళనం లో 
కంటికి కూడా కనిపించని కణాల మిళితంలో  
అన్ని రకాల భావనలను,
మనసుని కూడా మనుసులో ఇముడ్చుకున్న 
ఆదునిక యుగపు మరయంత్రానివా ?

మరి ఏముంది నీలో ?
ఎందుకింత ఆరాటం  ?


ప్రేమ సమాధానం: నాలో అంతులేని, అంతంలేని ప్రేముంది కాబట్టే దాన్ని అందుకోటానికి మీ ఆరాటం ........♥♥♥

6 comments :