పేజీలు

Friday, April 20, 2012

నా హృదయం....మనసు ముందరే ఆగిపొయిన నీ ప్రేమ అల.
మౌనం చుట్టూ బంధీ చేసిన నీ ఊసుల వల..
పెదవుల అంచుల్లో వినపడని నీ మాటల గలగల.
కన్నుల కొసరునే నువ్వు కడుతున్న కన్నీటి మాల..

నీ తలపుల ఇంధనంతో మండిపొతోన్న ఆలోచనల జ్వాల.
ఈ విషాదపు చాయల్లో నువ్వు ఊపుతున్న చేదు జ్ఞాపకాల ఊయల..
నిన్ను కానరాక నిద్రలేక ఒంటరైపోతున్న నా కన్నుల కల.
నువ్వు దక్కక అయిపోతోంది నా హృదయం ఒక శిల..

5 comments :

  1. నీ తలపుల ఇంధనంతో మండిపొతోన్న ఆలోచనల జ్వాల...good poetry.మంచి వాక్యం .విషాదం కవిత్వంలో విరజిమ్మారు.

    ReplyDelete