పేజీలు

Monday, April 30, 2012

నీకోసం నేను పసిడిబొమ్మ నవుతా...


మండుతున్న ఎండను శాంత పరిచే
తొలకరి చిరు జల్లులా వస్తాను...
తీగలా నిన్ను అల్లుకొని నీ మదిలో 
పువ్వులా ఆనంద రాగాలూ పలికిస్తాను...
వసంతాన కూసే కోయిల రాగమై
నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసే కిల కిల రావం అవుతాను...
చిలిపి చేష్టలతో నీలో హావా భావాలను
పలికించి హాయిగొలిపే పసిడిబొమ్మ నేనౌతాను...