పేజీలు

Friday, April 27, 2012

నా ఉహా.....


కరుణించే కంఠస్వరం నీవైతే
గర్వించే గుండే నేనవుతా...
వర్షించే మేఘము నీవైతే
సప్తవర్ణాల హరివిల్లు నేనవుతా..
వెసే ప్రతి అడుగు నీవైతే
పులకించే ప్రతి స్పందన నేనవుతా..
మెరిసే తారక నీవైతే
పరచే ఆకాశం నేనవుతా..
ఎద చిత్రించే కలల కుంచె నీవైతే
మది ఫలకంపై ఆశల రంగునవుతా..
ఏ కాంతిలేని ఏకాంతంలోకి పడవేస్తే
నీకు వెలుగునిచ్చే మినుగురు నవుతా..
వరములిచ్చే ప్రేమ నీవైతే
నీకు దాసోహం నేనవుతా.....