పేజీలు

Tuesday, November 20, 2012

జైహింద్!...


మతం వద్దు గితం వద్దు మారణహోమం వద్దు.
హిందు అని ముస్లిం అని బేదం అసలేవద్దు.
క్రిస్టియన్ అని సిక్కు అని కౄరత్వం మనకొద్దు.
పిడికిలెత్తి బిగించి జైహింద్ అని చాటుదాం!..

కులం వేరని, మతం వేరని రాజకియాలు అసలు వద్దు.
మనసులో మర్మంతో హింసజోలికెల్లోద్దు.
యువకుల జీవితంతో స్మోకింగ్ అని డ్రింకింగ్ అని దుర్వ్యసనాలసలొద్దు.
కలిసి మెలిసి సోదర సోదరి భావంతో ఐక్యతను చాటుదాం!...
జైహింద్ జైహింద్ అని భారతమాతకు దేశభక్తిని చాటుదాం!...

నోట్:-
ఎవరు దిన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు,
ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన గొడవల్లో ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చింది,
అందరు కలిసి మెలిసి ఉండాలన్న ఉద్ద్యేషంతో ఇలా రాసాను...

Friday, November 9, 2012

నీ స్నేహం ...


దేవుడు మనిషి జీవితం లో పూర్తి ప్రేమతో ఒక వ్యక్తి ఉండాలని అనుకున్నాడు.
అందుకనే "అమ్మని" తయారు చేసాడు..

మనిషి జీవితం లో పూర్తి సహాయం, బాద్యత తో ఒక వ్యక్తి ఉండాలని అనుకున్నాడు.
అందుకనే "నాన్నని" తయారు చేసాడు..

మనిషి జీవితం లో పూర్తి సహాయంగా ఒక వ్యక్తి ఉండాలని అనుకున్నాడు.
అందుకనే "అన్నయ్యని" తయారు చేసాడు..

మనిషి జీవితం లో ఆట పాటలు సంతోషాలు ఉండాలని అనుకున్నాడు.
అందుకనే "చెల్లిని" తయారు చేసాడు..

ఇంక ఇవన్ని లక్షణాలు ఉన్న ఒక వ్యక్తికి ఉండాలని దేవుడు అనుకున్నాడు.
అందుకనే "స్నేహితున్ని" తయారు చేసాడు..

నా ప్రపంచం నీ స్నేహం ...

అది నువ్వే....

Thursday, November 8, 2012

నువ్వే ఫ్రియతమా....



కల ఒక జ్ఞాపకం లాంటిది.
గుర్తుకొచ్చి రాక తికమక పెడుతుంది...
జ్ఞాపకం ఒక కల  లాంటిది.
నిజమో భ్రమో తెలియని అయోమయంలోకి నెడుతుంది...
కలలాంటి జ్ఞాపకం, జ్ఞాపకం లాంటి కల,
నువ్వే ఫ్రియతమా....

Monday, November 5, 2012

నీకై నీ ప్రేమకై!!!


ముగ్దమైన మది మందిరంలోంచి నేనూ నాకై ఆలోచిస్తున్నా,
అన్ని దారుల్లోంచి నా ఉనికిని నే వీక్షిస్తున్నా,
నిన్నటి నేడు లోంచి, నా రేపుకై వేచి చూస్తున్నా,
పూ రేకుల మాటున దాగిఉన్న నీటి బిందువులా.. నీ మౌనం నన్ను శిలను చేసింది...
ఆవిరిలా కరిగిపోక, ఈ శిలపై కరుణ చూపు.
తుమ్మెదనై  నీ చెంత చేరిపోతాను... 

Monday, October 22, 2012

దసరా శుభాకాంక్షలు...


బ్లాగ్ మిత్రులకు దసరా శుభాకాంక్షలు...

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ 'దసరా' లేక 'దేవీ నవరాత్రులు' అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో, పూర్వం రాజులు ఈశుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.

దుర్గాష్టమి

దుర్గాదేవి "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయతి వచ్చింది అని చెప్తారు.ఈరోజు దుర్గసహస్రనామ పారాయణము, 'దుం' అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. "ఈదుర్గాష్టమి మంగళవారంతో కలిసిన మరింత శ్రేష్టము", అని అంటారు.

మహర్నవమి

మానవకోటిని పునీతులను చేయుటకు భగీరదుడు గంగను భువినుండి దివికి తెచ్చినది ఈనాడే. ఇక ఈనవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈనవమి తిధిని గూర్చి చెప్పుటలో ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును. కావున 'సిద్ధదా' అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలుచేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగును. ఇక క్షత్రియులు, కార్మికులు, వాహన యజమానులు, ఇతర కులవృత్తులవారు అందరూ ఆయుధపూజ నిర్వహిస్తారు.

విజయదశమి

శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయము పొందినాడు.

శ్లో" శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ | 
    అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||

పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.



Saturday, September 15, 2012

నీ ధ్యాసలో ...


ప్రియతమా..
పిల్లగాలి తెమ్మరగా ఇలా వచ్చి అలా వెళ్ళావు...
నీవు తెచ్చిన స్నేహ సుగంధం ఇంకా పరిమళిస్తూనే ఉంది.
నీవు చెప్పిన ప్రేమ కబుర్లు ఇంకా సంతోషాన్ని ఇస్తున్నాయి.
సంతోషం రెక్కలు మొలిచి ఊహల్లో విహరిస్తూ ఉంటే.
నాకు దూరమై నింగిని తాకిన కలల చుక్కలను నేలకు రాల్చి తగులబెట్టావు..


అయినా నీ ధ్యాస
నాలో పెరుగుతూనే ఉంది.
ఉఛ్వాస నిచ్వాసలే నీవైనప్పుడు
నాకు ఇంకేం కావాలి,
నీవు తోడు రాకపోయినా
నీవు మిగిల్చిన
తడి ఆరని జ్ఞాపకాల ఊతం చాలు.
ఈ జీవితం మోడుబారకుండా గడిపేందుకు
నీవు వెదజెల్లిన
వెన్నెల వెలుగుల జిగేలు చాలు.
ఈ చీకటి పయనంలో చింతలేకుండా ఉండేందుకు.

Tuesday, September 4, 2012

చూడతరమా!


చూడతరమా!

పచ్చ పచ్చని పొలాలను,
గలగలా పారే నధులను,
తామర ఆకులమీద ఉన్న నీటిబిందువులను,
పల్లేటూరి అందాలను,
చూడతరమా!

అతి సుందరమైన నీమోము,
కలువల్లంటి కళ్ళు,
కొటెరు ముక్కు,
పాలుగొలిపే చెక్కిల్లు ,
చెక్కిల్లపై బోసినవ్వు,
ఆ నడుమొంపులోని నీ అందాన్నీ,
చూడతరమా!

ఆ అంధం వర్ణనాతీతం!!!

Monday, September 3, 2012

శృతి స్వాగతాంజలి..


కిలకిల నవ్వులతో హస్యాంజలి.
నెమలి వయ్యరాలతో నృత్యాంజలి.
సముద్రం అలల తాకిడితో ప్రశాంతాంజలి.
సప్తనధుల సమూహంతో పవిత్రాంజలి.
సరిగమపదనిసలతో సరాగాంజలి.
అందమైన పూలతో దేవుడీకి భక్తాంజలి.
స్వచ్చమైన తెలుగు మాటలతో మధురాంజాలి.
పడుచు పిల్ల అందాలతో నవరసాంజలి.
అచ్చమైన తెలుగుదనంతో నమస్కారాంజలి.
శృతి లయల సంగమంతో స్వాగతాంజలి.

Friday, August 24, 2012

మగువ...



కల్లకపటం లేక మెదులుకుంటాను!...
స్నేహభావంతో కలుపుకుంటాను!...

దూరమెంత అయినా కాని చేరుకుంటాను!...
బాధలెన్ని ఉన్నా కాని అందుకుంటాను!...

మంచి మనసుతో అర్ధం చేసుకుంటాను!...
కష్టసుఖాలను పంచుకుంటాను!...

జీవితాంతం నీకు తోడునీడనై ఉంటాను!...
మాతృత్వాన్ని పంచి పిల్లల ఆలనా పాలనా చుసుంటాను!...


అమేరికా సంబంధమని,
అందరిని వదిలి అన్నీ నీవని,
ఎన్నెన్నో ఆషలతో పురుషుడి జీవితంలోకి మగువ వస్తే,
వరకట్నం కోసం కల్లాకపటం తెలియని అమయకమైన ఆడపిల్లల్ని,
ఎందుకు పెళ్ళి చెసామా అని కన్న తల్లి తండ్రులు బాదపడేవిధంగా ప్రవర్తించి,
వాళ్ళు నరకం అనుభవించేలా చేసి,
చివరకు వాళ్ళ ప్రణం తీయడానికి కుడా వెనుకాడని పరిరిస్థితి ఎన్నో వార్తలు ప్రతీరోజు చుస్తునే ఉన్నము.
అన్నం పెట్టే చేతులే త్రిశూలం కుడా పట్టగలదని అలాంటివాళ్ళు గుర్తించుకోవాలి.
మన అమ్మ, అక్క, చెల్లి ఎంత ముఖ్యమో,
వేరే ఇంటినుండి కుడా వచ్చే అమ్మయి కుడా అంతే ముఖ్యమే అని తెలుసుకునే రోజు రావాలి....


తెలుగు మగువను గుర్తించండి.
తెలుగు మనుగడను కాపాడండి...


Please Stop Killing Women....





Saturday, August 18, 2012

నీ స్నేహం!...

నీ స్నేహం!...
నే నడిచిన బాటలో విరిసిన కుసుమం నీ స్నేహం!...
నే వదిలిన శ్వాసలో పలికిన భావం నీ స్నేహం!...
నా పయనపు గాయం నీ స్నేహం!...
నా పలుకుల అర్ధం నీ స్నేహం!...
నా అడుగుల శబ్దం నీ స్నేహం!...
నా ఆశల అందం నీ స్నేహం!...

Monday, August 13, 2012

నా హ్రుదయ స్పందన!...



కన్నులు నావే,
రెప్పలు నావే,
కలలో మాత్రం ప్రియుడా నీవే!..

హ్రుదయం నాదే,
ఊహా నాదే,
మనసు మాత్రం ప్రియుడా నీదే!..

లక్ష్యం నాదే,
ప్రేరణ నాదే,
గెలుపు మాత్రం ప్రియుడా నీదే!...

నీవు లేనిదే కాలం సాగదు, నా జీవిత గమ్యం నీవు, నా సర్వస్వం నీవే......

Saturday, August 4, 2012

నాకిష్టం.!!!

 నాకిష్టం
ఆకలి దప్పిక తీర్చిన అమ్మంటే నాకిష్టం.
నడక నడత నేర్పిన నాన్నంటే నాకిష్టం.
భవిత భావం భోదించిన గురువంటే నాకిష్టం.


అమ్మ నాన్న ల ప్రేమ 

కష్టము సుఖము ఒసంగిన భగవంతుడంటే నాకిష్టం.
కల్ల కపటము తెలియని పిల్లల నవ్వులంటే నాకిష్టం.
పసి పిల్లలు నిద్రిస్తున్నపుడు వాళ్ళ దగ్గరున్న నిశ్శబ్ధం నాకిష్టం.


ప్రకృతి

అందమైన సీతాకోక స్వేచ్చగా విహరించడం నాకిష్టం.
మనసుకి ప్రశాంతతనిచ్చే సంగీతం అంటే నాకిష్టం.
ప్రకృతిని ఆస్వాదించడం అంటే నాకిష్టం.


 ప్రేమ 
నిన్ను ప్రేమించడం అంటే నాకిష్టం.
నిన్ను సంతొషంగా చుడడం అంటే నాకిష్టం.
అన్నో కొన్నో ఇష్టాలకు దూరమై కష్టంగా ఉంటున్నా,
నాకున్న ఇష్టమైనవాళ్ళకి కష్టం రానివ్వకుండా చూడటం నాకింకా ఇష్టం.

Friday, August 3, 2012

ప్రేమ & జీవితం...


ప్రేమ ఆకాశమంత ఉన్నతమైనది.
ప్రేమ సముద్రమంత లోతైనది.
ప్రేమ ప్రకృతి అంత చిత్రమైనది.
ప్రేమ సృష్టి అంత విచిత్రమైనది.
ప్రేమ జీవితం లో ముఖ్యమైనది.

కాని ప్రేమే జీవితం కాదు.
అలాగని ప్రేమ లేకుండా జీవించనూ లేము..
ప్రేమ కు విలువనిద్దాం...

Tuesday, July 31, 2012

స్నేహ కావ్యం!


గడిచిన ప్రతీక్షణం ఒక తీపి జ్ఞాపకం...
రాబోయే ప్రతీక్షణం ఒక ఉషోదయం...
ఆ ఉషోదయం వెలుగులా మన స్నేహం అందమైన కావ్యం...
ఇలాగే నిలవాలి మన స్నేహం కలకాలం...

Thursday, July 26, 2012

నిరంతర ప్రయత్నం...



ఆకాశాన్ని చేరలేకున్న కెరటాలు అలుపెరుగక ఉవ్వేతున పైకి ఎగిసేను,
మేఘాల గుండె కరిగి ప్రేమతో చిరుజల్లై నింగిని వీడి ఈ కెరటాలను చేరెను,
నీ ఆశ శ్వాస అయిన దాని కోసం అలుపెరుగక ప్రయత్నం కొనసాగించు,
అడవిన వున్నా నీ కొరకు ఆ వెన్నెల వెలుగులు వచ్చి చేరెను...
నీకోసం తడిఆరని కన్నులతో ఎదురుచూస్తున్నాను.....