పేజీలు

Saturday, September 15, 2012

నీ ధ్యాసలో ...


ప్రియతమా..
పిల్లగాలి తెమ్మరగా ఇలా వచ్చి అలా వెళ్ళావు...
నీవు తెచ్చిన స్నేహ సుగంధం ఇంకా పరిమళిస్తూనే ఉంది.
నీవు చెప్పిన ప్రేమ కబుర్లు ఇంకా సంతోషాన్ని ఇస్తున్నాయి.
సంతోషం రెక్కలు మొలిచి ఊహల్లో విహరిస్తూ ఉంటే.
నాకు దూరమై నింగిని తాకిన కలల చుక్కలను నేలకు రాల్చి తగులబెట్టావు..


అయినా నీ ధ్యాస
నాలో పెరుగుతూనే ఉంది.
ఉఛ్వాస నిచ్వాసలే నీవైనప్పుడు
నాకు ఇంకేం కావాలి,
నీవు తోడు రాకపోయినా
నీవు మిగిల్చిన
తడి ఆరని జ్ఞాపకాల ఊతం చాలు.
ఈ జీవితం మోడుబారకుండా గడిపేందుకు
నీవు వెదజెల్లిన
వెన్నెల వెలుగుల జిగేలు చాలు.
ఈ చీకటి పయనంలో చింతలేకుండా ఉండేందుకు.

9 comments :

 1. picture and me kavitha rendoo chaalaa baagunnayandi

  ReplyDelete
 2. చాలా బాగుందండి

  ReplyDelete
 3. శృతి బాగుందండి

  ReplyDelete
 4. Thanku skv ramesh, cheppalante, veena f & Priya garu...

  ReplyDelete
 5. very nice, image chustunte appudu nee puttinaroju oka gift ichanu kada.....adi gurtostundi dear..........

  ReplyDelete
 6. నాకు దూరమై నింగిని తాకిన కలల చుక్కలను నేలకు రాల్చి తగులబెట్టావు..


  aa kalalaku malli pranaam vaste entho bagunno.....

  ReplyDelete
 7. వినాయక చవితి శుభాకాంక్షలు!

  ReplyDelete