పేజీలు

Saturday, November 16, 2013

నే మరువను నిన్ను!


పున్నమి నాడు వెన్నేలలో చంద్రునిలా నన్ను చుట్టుముట్టినావు.
సాయంకాలం మల్లె తీగవై సుగంధంలా నన్నల్లుకున్నావు.
వర్షకాలము వానలో చినుకువై నన్ను తడిమిపోయావు.
శీతాకాలము చలిలో మంచుముద్దలా నన్ను స్పర్శించినావు.
నా నయనం నిద్రిస్తుండగా కలవై నన్ను కవ్విస్తున్నావు.
పిల్లగాలికి హాయిగా సేదతీరుతుండగా పిలనగ్రోవిలా పలకరించిపోయావు.
గలగలపారే నధిఒడ్డున నేనుంటే అలల సిరి సిరి మువ్వల సవ్వడివై నన్ను తాకిపోయావు.
నువ్వు వస్తున్నావని పావురంతో కబురు పంపించావు.
కోకిలమ్మ గానంతో నీలేఖ పాటగా పాడించావు.
నా ఆలోచనలో చిరునవ్వనే మధురత్వాన్ని పరిచయం చేసావు.
నా ప్రాణం, నాధ్యానం, నువ్వేనని తెలిసేలా చేసావు.
నువ్వొస్తున్నావని  తెలిసి పరవళ్ళుతొక్కుతూ పరవశంతో  ఎదురుచూస్తున్నాను.
నే మరువను నిన్ను!

18 comments :

 1. aksharaalu aduputhappi pakshulowthunayo leka nee manasu paravasinchi manulu kuripisthunayo....

  ReplyDelete
  Replies
  1. అక్షరాలు అదుపుతప్పలేదు. నా మనసు కూడా అదుపుతప్పలేదు:-)) ప్రేమ లోని మాధుర్యాన్ని మీకు అక్షరాల రూపంలో చూపించా:-))

   Delete
  2. aksharala lone kaadhu mee sneham lonu aa maadhuryam undhandoi :)

   Delete
  3. ThankQ very much dear kalyan:-)) alwayz i wud like to b like this only:-))

   Delete
 2. శృతి అందమైన తెలుగు పదాలతో చక్కగా వ్రాస్తున్నావు. పిక్ సూపర్:-)) Keep continues:-))

  ReplyDelete
  Replies
  1. ప్రియ గారు నచ్చినందు ధన్యవాదాలు:-))

   Delete
 3. roju roju ki nee andham tho paatu, nee maatala wratalu lu kuda andanni santarinchukunnayi, edi kalakaalam ilage konasagali, superb lines dear........... nice poetry from a beautiful &awesome lady

  ReplyDelete
  Replies
  1. Rudr ThanQ Very much for inspirational words from u:-))

   Delete
 4. శ్రుతి గారూ, మంచి భావ ప్రకటన ఉంది మీ కవితల్లో, ఇలాగే రాయండి.

  ReplyDelete
  Replies
  1. ఫాతిమా గారు నచ్చినందు ధన్యవాదాలు:-))

   Delete
 5. aksharalalone kaadhu mee sneham lonu aa madhuryam undhandoi :)

  ReplyDelete
  Replies
  1. ThankQ very much dear kalyan:-)) alwayz i wud like to b like this only:-))

   Delete
 6. కవిత్వం రాయడానికి ఆ పైవాడిచ్చిన అద్భుతమైన అనుభూతి ప్రేమ. ప్రేమ అన్న భావన అక్షరాలను,
  ఊహలను పరుగులు పెట్టిస్తుంది. మీ బ్లాగు చూస్తున్నాను. మొదట్లో కన్నా ఇప్పుడు
  మీ భావవ్యక్తీకరణ పదును పడుతోంది. రాస్తుండండి, శృతి.

  ReplyDelete
  Replies
  1. Thank Q Sateesh gaaru:-)) always your comment gives me special encourage to me. thankQ:-))

   Delete
 7. నా నయనం నిద్రిస్తుండగా కలవై నన్ను కవ్విస్తున్నావు...
  కోకిలమ్మ గానంతో నీలేఖ పాటగా పాడించావు...
  నువ్వొస్తున్నావని తెలిసి పరవళ్ళుతొక్కుతూ పరవశంతో ఎదురుచూస్తున్నాను...

  చక్కని భావుకతకు ఆకృతి...
  మక్కువ కలిపించింది ఓ శృతి...

  స్నేహపూర్వక అభినందనలు...
  (అలాగే ఓ స్నేహపూరిత సలహా...
  అక్షర దోషాలను సరిదిద్దుకోగలరు)

  ReplyDelete
  Replies
  1. Than Q very much N M Rao garu, Tappakunda chusukuntaanu:-)

   Delete