పేజీలు

Saturday, November 23, 2013

నా ఆశ!


వడగాల్పుల్లో నీవు నడచి వచ్చినపుడు,
మలయ మారుతమై నిన్ను చుట్టాలని..

శ్వేదం శరీరాన్ని కమ్ముకున్నప్పుడు,
వింజామరనై వీచి చల్లబరచాలని..

చిరు చెమటలు నుదుట అలముకున్నప్పుడు,
చల్లటి వస్త్రమై నీమోము తడమాలని..

దాహార్థి కలిగినపుడు,
సెలయెటినై నీ ధారిలో సాగాలని..

అలసిన నీమేను సేధతీరుటకు,
ఫూలపానుపునై అమరాలని..

నీవు నదిచే ప్రతి అడుగులొ నలిగే పాధ ధూలినై,
నిన్ను ఆరాధించాలని..

నీమాటలో పధాల అమరికనై,
నువ్వు మట్లాడే భాషలా ఉండాలని..

నీ స్వరంలో శబ్ధాన్నై, ఆరోహన అవరోహన శృతినై,
నీ అనుమతితోనె నా శ్వాస నిలపాలని..

నా మనసుపడే ఆశ..
ఈ ఆశలన్ని నెరవేరేది ఎప్పుడో?

11 comments :

 1. mee thapana amma dosilla vantidhandi..... raananthavaraku vechi untundhi... vachhakka challaga ahwanisthundhi.... chaduvuthunte haayiga nidhurothunattu(ee lokam antha preme anna bhaavanatho bayame lekunda bedhure lekunda) undhi naaku....

  ReplyDelete
 2. త్వరలో తప్పక నెరవేరాలని ఆశ....బాగుంది కవిత

  ReplyDelete
 3. చాలా బాగుంది శృతి. మీ ఆశ తప్పక నెరవేరాలని మా ఆశ..

  ReplyDelete
 4. nee maatala pallakiki naa prema poorvaka vandanamulu priyaa...........

  ReplyDelete
 5. twaralone neraverutundi...........

  ReplyDelete
 6. శృతి... ఇవి అక్షరాల్లా లేవు... మనసులోతుల్లోంచి కురిసిన
  ప్రేమ చినుకుల్లా ఉన్నాయి. ఇంకా ట్రై చేయండి మీలో మంచి భావుకత ఉంది.

  ReplyDelete