పేజీలు

Thursday, November 14, 2013

♥♥ మధి తలపులు ♥♥

విప్పకనే విప్పేసా మనసులో మాటలని,
భాషకందని భావాలేన్నేన్నో..
మాటలకందని మమకారాలెన్నెన్నో..

చెప్పకనే చెప్పేసా మధి తలపులని,
నీకై ఆలోచనలెన్నేన్నో..
నీకై భావాలుమరింకెన్నో..

అడగకనే ఆడిగేసా నాపైనీకున్న భావాన్నీ,
నాలో నచ్చినవేంటేటోని..
నాపై నీకున్న నమ్మకమేమిటోనని..

ఇవ్వకనే ఇచ్చేసా నామనసుని,
నీపై నాకున్న ప్రేమ అందమైనదని..
చెలికాడి ఊసులు చిలిపి వలపులని..

చూపకనే చుపేసా తొలిస్పర్శ అందాలని,
నా సిగ్గు, వలపు, అల్లరి నీకిస్టమని..
నాచిరునవ్వే నీకు సంతోషమని.

కలపకనే కలిపేసా నీజీవితంలో నన్ను,
ప్రణయ ప్రయాణం సుఖసాగరమని..
నువ్వు నేను వేరుకానని..

20 comments :

  1. శృతి చాలా బాగుంది:-)) నువ్వు నేను వేరుకానని అన్న పదం చాల నచ్చింది:-)))

    ReplyDelete
    Replies
    1. ప్రియ గారు నచ్చినందుకు ధన్యవాదాలు:-))

      Delete
  2. choodakane choosesaa donga chaatugaa aa bommanu..... chadavakane chadivesaa virahaanni daasthu ee varusalanu.... cheppakane cheppesthunna ee bhavaanni anubhavinchaalsindhenantu....

    ReplyDelete
  3. కలపకనే కలిపేసా నీజీవితంలో నన్ను,
    ప్రణయ ప్రయాణం సుఖసాగరమని..
    నువ్వు నేను వేరుకానని..

    yes......it's true

    ReplyDelete
  4. kannulaarpakunda chuse andham needi
    aa andham chusi naa manasu moogapoyindi
    maatalu raaka, shilpam la ala chustu undipotunnanu.

    superb image dear........

    ReplyDelete
  5. బాగుందండి... దాపరికంలోనే అందమంతా... విప్పకనే విప్పేసా అని మీరంటున్నా... అంతా గుట్టుగానే ఉంది.
    మీ భావంలో అల్లరి బాగుంది.

    ReplyDelete
  6. అక్షరాలు అల్లరి చేస్తున్నాయి. భావాలు కొంటెతనం చిలిపిగా పలకరిస్తోంది. బాగుంది శృతి.

    ReplyDelete
    Replies
    1. అక్షరాలు అల్లరి చేసినా నేను అల్లరి చేసినా భావం నచ్చినందు ధన్యవాదాలు సతీష్ గారు:-))

      Delete
  7. తప్పక నే చెబుతున్నా...
    గొప్పగనే బహు బాగుందని...

    ReplyDelete
  8. తప్పక నే చెబుతున్నా...
    గొప్పగనే బహు బాగుందని...

    ReplyDelete
  9. తప్పక నే చెబుతున్నా...
    గొప్పగనే బహు బాగుందని...

    ReplyDelete
  10. తప్పక నే చెబుతున్నా...
    గొప్పగనే బహు బాగుందని...

    ReplyDelete