పేజీలు

Tuesday, December 25, 2012

నాకు తెలియదు...

పెదవి పలికేది కాని,
ఆ పలుకులు ఇంత మధురమైనదని,
నీ పేరు పలికేవరకు తెలియదు!

గుండె కొట్టుకునెది కాని,
అది నీ తలపుతోనే అని,
నిన్ను ప్రేమించేవరకు తెలియదు!

మన ఇద్దరి మధ్య స్నేహం ఉంది కాని,
ఆ స్నేహం ప్రేమకు దారి తీస్తుందని,
నీ ఓరచూపులతో నన్ను చూసేవరకు తెలియదు!

వయసు మొగ్గెసింది కాని,
అది పుష్పించిందని,
నువ్వు తాకేంతవరకు తెలియదు!

నాలో బావం ఉంది కాని,
సిగ్గు మొగ్గలేసుందని,
నువ్వు తొలిముద్దు ఇచ్చేవరకు తెలియదు!

నా తడి ఆరని అందాలు,
నీకు మాత్రమే సొంతమని,
నీలో కలిసేవరకు తెలియదు!

ఊపిరి ఆగిపోయెవరకు నిన్ను మరచిపోలేనని,
మన ప్రేమ చిరకాలమని,
నిన్ను ప్రేమించేవరకు తెలియదు!

శృతి లయల సంగమంలా మన జీవితం సాగిపొతుందని,
నా ప్రేమే నా ప్రాణమని,
నీతో కలిసి జీవించేవరకు తెలియదు నా ప్రాణమా!...

6 comments :

 1. బాగుంది శృతి గారు.. ఆడవారి ఫీలింగ్స్ గురించి బాగా చెప్పారు)...

  ReplyDelete
 2. మీ కవితలోని ఫీలింగ్ చాలా బాగుంది శృతి గారు

  ReplyDelete
 3. Thanku soo much prince garu, Priya garu & David Garu....

  ReplyDelete
 4. శృతి లయల సంగమంలా మన జీవితం సాగిపొతుందని,
  నా ప్రేమే నా ప్రాణమని, నీతో కలిసి జీవించేవరకు తెలియదు నా ప్రాణమా!..

  chal "Madhu"ranga undandi vinadaaniki.....very nice

  ReplyDelete