పేజీలు

Thursday, January 9, 2014

♥♥ నీ కోసం వేచివున్నా ♥♥


తొలి మంచుబిందువే నా చెక్కిలిని తాకి మురిసిపోనట్టు,
బొండు మల్లె నావాలుజడను తాకి సిగ్గులొలికినట్టు,

నాకనులే కలగన్న చిత్రము నా కళ్ళముందున్నట్టు,
మైమరిచే సొగసుల పుప్పోడుల అందాలు  కదిలినట్టు,

వీచే చల్లగాలే నా మేనును తాకి ప్రేమ సరాగం నాలో కవ్వించినట్టు,
మదిని దోచిన నా పరువం నీరాకతో మైమరచినట్టు,

తొలి వెన్నేలరేయి నా తనువును తాకి  తన్వయంతో తడిమినట్టు,
అందమైన నా ఊహల్లో నువ్వే చిలిపిగా అల్లరి చేసినట్టు,

మధురమైన నా భావాల్లో కలకాలం గీతమై నిలిచినట్టు,
మనసు పాడె గీతం ప్రణయ రాగం ఆలపించినట్టు,

ఇన్నిన్ని భావాలతో నా సోయగాలు నీకై స్వాగతిస్తూ,
కోటి తారల పున్నమి వెన్నల్లో శృంగార కావ్యాన్నై నీ కోసం వేచిఉన్నా..

4 comments :

  1. ప్రకృతి మీ కవిత చుట్టూ పరవశించి పరిభ్రమిస్తున్నట్లుంది శృతిగారు .

    ReplyDelete
  2. శృతి చాలా బాగుంది. మంచి భావంతో రాసారు:-)

    ReplyDelete
  3. Wow... Really Marvellous Piece of Poetry
    Keep up your Spirits Sruti..

    ReplyDelete