పేజీలు

Friday, November 29, 2013

అపజయాల ప్రేమ..


గుండె లోతుల్లో జనియించిన లావ
మనసుని దహించివేస్తుంది.

విరహం నిండిన మనసు
విస్పొటనం కలిగిస్తుంది.

కర్తవ్యం మరచి వ్యక్తిత్వం విడచి
నీచుట్టు పరిభ్రమించిన గతం వెక్కిరిస్తుంది.

అబలను ఆటబొమ్మగా వాడి వదిలివేసిన వైనం
ధర్మం అంధకరంలా ఉందని తెలియజేస్తుంది.

అస్తిత్వం పోగొట్టె ప్రేమకు అమరత్వం ఎలా వస్తుంది
అపజయాల పల్లకిమోసె ప్రేమ ఎందుకు.

బాదతో నిండిన మనసు
కొవ్వోత్తిలా కాలి కరిగిపోతుంది.

కన్నీరు ప్రవహాంలా పారి
మనసు మూగబోయింది.

నీవు లేని వర్తమానంలో
నీవు రాని భవిష్యత్తుకై ఎదురుచుస్తున్నాను.

15 comments :

  1. చాలా బాగుంది. నీవు లేని వర్తమానంలో నీవు రాని భవిష్యత్తుకై ఎదురుచుస్తున్నాను. అన్న పదం చాలా బాగుంది:-)) పిక్ లో ఉన్న భాద కవితలో కనిపిస్తుంది:-))

    ReplyDelete
    Replies
    1. ప్రియ గారు నచ్చినందుకు ధన్యవాదాలు:-))

      Delete
  2. అస్తిత్వం పోగొట్టె ప్రేమకు అమరత్వం ఎలా వస్తుంది
    అపజయాల పల్లకిమోసె ప్రేమ ఎందుకు. Nice lines

    ReplyDelete
    Replies
    1. పద్మర్పిత గారు నచ్చినందుకు ధన్యవాదాలు:-))

      Delete
  3. మనసులోతుల్లో దాగున్న నిజాల కదలికల అలజడులే మీ కవితలై కరువైపోయిన కన్నీటిని అక్షరాలుగా పేరుస్తున్నారు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు అండి:-))

      Delete

  4. నీవు లేని వర్తమానంలో
    నీవు రాని భవిష్యత్తుకై ఎదురుచుస్తున్నాను.
    చాలా నచ్చిందీ ముగింపు పాదం.. అభినందనలతో..

    ReplyDelete
    Replies
    1. వర్మ గారు నచ్చినందుకు ధన్యవాదాలు అండి:-))

      Delete
  5. sruthi emo mari na vimarsa dheeniki varthisthundho ledho kaani na manasu choodu ani thelipe paaradarsakatha, theliyani avedhanalo unnaanantu thelipe cheekati, karigipoye aashale ivi antu thelipe a kovotthi ivvani choosthunte naaku ila cheppalani thochindhi...

    undiponi nee kanula therapai edhuruchoopula...
    masulukonivvu nee manasulo avedhanalaa...
    cherigiponi dhooraaniki badhulu dhigulaithe...
    cherapaleni premaku migiliponivvu neelo oka saakshyamu....

    ReplyDelete
  6. కళ్యాణ్ నీ విమర్షలన్ని స్నేహపూర్వకంగా స్వీకరించే మనస్తత్వం నాది:-))ఇంతకి నచ్చిందా గురు:-))

    ReplyDelete
  7. ohh naaku thelusugaa vere cheppalnaa enti :) ?? chala chala nachhindhi.... nachhindha ani nu adagatamu bagundhi ani nenu cheppatamu idhi kooda nachhindhi :)

    ReplyDelete
  8. శృతి గారు... పదాల అమరికలో బిగుతు కొనసాగింది చివరివరకు. రచయితకు కావల్సిన మొదటి లక్షణం అబ్బింది మీకు.
    పైగా విషాదాన్ని కవితా వలయంలో అక్షరబంధం చేయడం అంత సులువేం కాదు. మీ ప్రేరణ ఎవరో గానీ... బాగా రాస్తున్నారు. ఎవరేమనుకున్నా సద్విమర్శ అనుకుని ముందుకు సాగండి. ఆపకండి. బెస్ట్ ఆఫ్ లక్.

    ReplyDelete
  9. శృతి గారు... పదాల అమరికలో బిగుతు కొనసాగింది చివరివరకు. రచయితకు కావల్సిన మొదటి లక్షణం అబ్బింది మీకు.
    పైగా విషాదాన్ని కవితా వలయంలో అక్షరబంధం చేయడం అంత సులువేం కాదు. మీ ప్రేరణ ఎవరో గానీ... బాగా రాస్తున్నారు. ఎవరేమనుకున్నా సద్విమర్శ అనుకుని ముందుకు సాగండి. ఆపకండి. బెస్ట్ ఆఫ్ లక్.

    ReplyDelete