పేజీలు

Tuesday, November 27, 2012

ఎవరు నువ్వు?


అనుక్షణం వెంటాడుతుంటే నా నీడవనుకున్నాకున్నా,
కానీ ప్రత్యేకమైన రూపం నీకుంది...
ప్రతిక్షణం నీ తలపులే చుట్టుముడుతుంటే నువ్వే నా ఊహానుకున్నా,
కానీ అందమైన జీవితం నీకుంది...
నా చెక్కిళ్ళు ఎరుపెక్కి, చిరునవ్వుతో పెదాలుంటె అదంతా నా పరధ్యాసేననుకున్నా,
కానీ ఆలోచన నీకుంది...
నా నడుమొంపుల్లోని వయ్యారాలు  నన్ను మైమిరిపిస్తుంటే నీస్పర్శే అనుకున్నా,
నీ కార్యక్రమం నీకుంది...

నీ జ్ఞాపకాల జడిలో నన్ను బంధిచేసి, నీకై ఎదురుచూసే నన్ను ఒంటర్నిచేసిన నువ్వెవరివి మరి?

నా నీడవా?
నా ప్రతిబింబానివా?
నా మిత్రుడివా?
నా మనసువా?
నా ప్రియిడివా...
నా ప్రాణమా?

మీరైనా చేపుతారా?