పేజీలు

Monday, March 12, 2012

ప్రేమ...



సృష్టి యొక్క బలం బలహీనత ప్రేమ.
చావు పుట్టుకలకు మద్య గల అనుబందం ప్రేమ...

ఆకాశం కోసం ఎగిసే కెరటాల ఆరాటం ప్రేమ.
ఎడారిలో ఎండమావిలో నీరు ప్రేమ...

ప్రపంచాన్ని జయించే శక్తినిచ్చేది ప్రేమ.
ద్వేషాన్ని కూడా ప్రేమతో గెలిచేది ప్రేమ..

ఆకలిని తెలుసుకొని అన్నం పెట్టె అమ్మంటే ప్రేమ.
కావలసింది తెలుసుకొని ఇచ్చే నాన్నంటే ప్రేమ...

నొప్పి తెలియని తీయ్యని గాయం ప్రేమ.
చితి మీద వున్నా నిన్ను వీడని జ్ఞాపకం ప్రేమ...

ఈ సమాజం యొక్క బలం బలహీనత ప్రేమ.
మనస్సును మైమరపించే మైకం ప్రేమ...

యవ్వనంలో కలిగే భావన ప్రేమ.
వృద్దాప్యం లో వుండే ఆప్యాయత ప్రేమ...

మరణం అంటూ లేనేలేనిది ప్రేమ.
స్నేహాన్ని సైతం విడదీసేది ప్రేమ...

ఆకాశానికి ఉవ్వెత్తున ఎగసిపడే అలజడి ప్రేమ.
చితిమీద కూడా పరిమలించెను ప్రేమ...

ఊహ లోకం లో విహరించేలా చేసేది ప్రేమ.
నిన్ను నువ్వు మరిచేలా చేసేది ప్రేమ...

కొమ్మన విరిసే కుసుమం ప్రేమ.
వెన్నెల విరిసే విరహం ప్రేమ...

గమ్యం తెలియని పయనం ప్రేమ.
చీకటిలో వెన్నెల్లా వెలుగుచుపెను ప్రేమ...

అర్ధం తెలియని రెండక్షరాల పదం ప్రేమ.
వ్యర్ధం కాని జీవిత పరమార్ధం ప్రేమ...

3 comments :

  1. "...చితి మీద వున్నా నిన్ను వీడని జ్ఞాపకం ప్రేమ...
    వ్యర్ధం కాని జీవిత పరమార్ధం ప్రేమ..."
    ప్రేమని చక్కగా నిర్వచించారు.
    జన్మ జన్మలకూ ప్రేమ తరగని అనుబంధమే ప్రేమ

    ReplyDelete
  2. ప్రేమ అంటేనే నిజం.
    ఎన్ని కోట్లు పెట్టినా కొనలేము కదండి.
    చిన్ని ఆశ చిన్ని ఆశ గారు మీకు ధన్యవాదాలు అన్డి.

    ReplyDelete
  3. చక్కగా వర్ణించారు.ప్రేమ ను విశాల దృక్పథం లో వ్రాశారు. యండమూరిగారి ప్రేమ నవల చదివివుంటారు కదా !అద్భుతంగా వ్రాసారుప్రేమ గురించి .

    ReplyDelete