పేజీలు

Friday, December 30, 2011

వర్షంలో నువ్వు నేను.......

ఆరోజు సాయంత్రపు సమయాన చల్లని ఎదురుగాలులతో వర్షం పడుతుంది
సాయంత్రం ఆఫీసు అయిపోగానే నువ్వు-నేను వర్షం పడుతుంది కదా అని చెట్టుకింద నిలుచున్నాము
వర్షం పడుతూనే ఉంది...ఇక వర్షం ఆగేల లేదు మనం వెళ్దాం పద అన్నాను
నువ్వు కూడా ఒక "ఉ" కొట్టి పద అన్నావు....
రోడ్ దాటేటప్పుడు ట్రాఫ్ఫిక్ ఎక్కువగా ఉంది...నావల్ల రోడ్ దాటడం అవట్లేదు
అల అల మెల్లిగా రోడ్ దాటేసాము...ఫుట్పాత్ నువ్వు ఎక్కి నిల్చున్నావు
నాకేమో ఎక్కడానికి అవడంలేదు....అప్పుడే రెండవసారి నువ్వు నా చేయిని పట్టుకోవడం
బస్సు ఎక్కిన తరువాత ట్రాఫ్ఫిక్ లో బస్సు ఆగిపోయింది...ఇక లాభం లేదని
పద నడుస్తూ వెళ్దాం అని నీకు ఫోన్ చేశాను....ఇద్దరం బస్సు దిగి నడుస్తున్నాము
వర్షం లో.......ఆ వర్షం నీటిలో నీతో నడిచిన ఆ రోజును నేను జీవితం లో మరచిపోనురా....
ఎప్పుడు వర్షం పడిన నువ్వే గుర్తొస్తావ్....అసలు మరచిపోలేదు అనుకో....
కాని వర్షం పడే ప్రతి సారి కాస్త ఎక్కువగా గుర్తోచి ఏడుస్తాను....
ఆ వర్షంలో నా కన్నీరు ఎవరికీ కనపడదు....నాకు నీ మనసుకు తప్ప.....

1 comment :