పేజీలు

Thursday, December 29, 2011

నువ్వున్నావు...నీ జ్ఞాపకాలున్నాయి

స్నేహం, ప్రేమ, ఇష్టం, ఇష్టపడటం.....ఇవన్నిన్నింటికి అర్దాలు నాకేం తెలుసు,
ఇవన్నిన్నింటికి అర్దాలు, వాటిలో ఉండే ప్రత్యేకమైన అనుభూతి, అనుభవించే వరకు నాకు తెలిదు.
ప్రేమ అనేది ఏందీ తియ్యనైన పదమో అంతకన్నా "మధు"రమైన అనుభవం
నా స్వశ ఆగిపోయేవరకు నా జీవితంలో నిన్ను నీ ప్రేమను మరచిపోలేను
ఈరోజు నేను బ్రతికి ఉన్నాను అంటే దానికి కారణం నువ్వు, నీ ప్రేమే....
స్ప్రుష్టిలో తియ్యని పధం, మాటలకందని కమ్మని భావం, కెరటాలు ఎగసి పడే దూరం,
హృదయాని చేసే గాయం, దగ్గర ఉన్నా చేరవలేని తీరం, చిరకాలం నిలిచే కమనీయమైన కావ్యం మన ప్రేమ
అసలు నేను కూడా ఒకర్ని ప్రేమిస్తానని నాకే తెలిదు. ఈ ప్రపంచం మొత్తంలో నాకు నువ్వంటే ప్రాణం.
కళ్ళు మూసిన, తెరిచినా నువ్వే కనిపిస్తావు నాకు, ఏ పని చేస్తున్న నువ్వే....
నువ్వెప్పుడు నాప్రక్కన లేవని నేను అనుకోలేదు...ఎందుకో అంతగా నువ్వు నా ముందున్తావు,
నా ప్రక్కనే ఉంటావు..నాతో మాట్లాడుతావు...
నా దేహంలో అణువణువునా నువ్వున్నావు...నీ జ్ఞాపకాలున్నాయి

2 comments :

  1. చిన్న చిన్న పదాలనే అద్భుతంగా కూర్చి కవితగా రాస్తున్నారు - చాలా బాగున్నాయి మీ కవితలు.

    ReplyDelete
  2. Thanku soo much Mahesh gaaru, Welcome to my blog...

    ReplyDelete