పేజీలు

Tuesday, June 19, 2012

జన్మదిన శుభాకాంక్షలు......


ఆ బ్రహ్మ పరవసించి ఈ చిన్ని కృష్ణున్ని భువికి పంపిన రోజు.
తన్మయత్వంతో ఇంటిల్లపాది ఆనందంలో ఓలలాడిన రోజు.
నీ చిట్టి చిట్టి అడుగులతో ఇంటిని బృందావనం లా మార్చిన రోజు.
ఆకాషం లో హరివిల్లు అందంగా వికసించి అలరించిన రోజు.
నెలరాజుని చూసి కోయిల ఆనందంతో రాగం పాడిన రోజు .
నాట్యమయూరి అయిన నెమలి ఆనందం తో పరవషించిన  రోజు.
అందుకో నా  హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ నీ పుట్టిన రోజు.


 నా మిత్రులారా ఈ రోజు నా రుద్ర్  పుట్టినరోజు  అందరు విషెస్ చెప్పండి ప్లీస్......

Monday, June 18, 2012

నీ జ్ఞాపకమే....


నువ్వు గుర్తుకొస్తే చాలు
నాలో ఎమీ ఉండదు నీ జ్ఞాపకం తప్ప
నా నిన్న నాకు గుర్తుకురాదు
నా రేపుకై తొంగిచూసే ఆశ ఉండదు
నా నిన్నకి,నేటికి మద్యన వంతెన దూరమైంది
ఈ క్షణం శాశ్వత మైపోయింది
నువ్వు నాతో ఉంటే చాలు
నాలో నేనుండను, అంతా నువ్వు నీ జ్ఞాపకమే.

Friday, June 15, 2012

క్షణ క్షణం నిరీక్షణ.....


క్షణ క్షణం అనుక్షణం నిరీక్షణం
నీకోసం ఈ ఆవేశం
ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఇన్నాళ్ళుగా
ఎదురుచూసి అలసి సొలసి సొమ్మసిల్లి
పడిపోయా !
తర తరాలు యుగ యుగాలు
వత్సరాలు గడిచిన
మరువరాని మరపురాని క్షణాలను
తలచి తలచి దుఖిస్తూ
నిర్జీవమైన దేహంతో
అంతులేని అనంతమైన
శూన్యంలో రెప్పపాటు
దుఖంతో
మూలుగుతూ మ్రుక్కుతూ
నీకోసం ఆలోచిస్తూ అన్వేషిస్తూ
నిరీక్షిస్తూ నిట్టుర్పు విడుస్తూ
భాధతో వ్యధతో నీకోసం................................- ......................క్షణ క్షణం

Wednesday, June 13, 2012

ప్రియతమా.....


భూమి గుండ్రంగా తిరగడం ఆగిపోయినా,
పక్షులు ఆకాషం లో విహరించడం ఆపేసినా,
నెమలి నాట్యం మరచినా,
క్రొవ్వొత్తి వేడి కి కరగడం ఆగిపొయినా,
చేపలు నీళ్ళల్లో ఈత కొట్టడం మానేసినా,
హ్రుదయం ఊపిరి పిల్చడం ఆపెసినా,
కాని నేనెప్పుడు నిన్ను మరవను ప్రియతమా...

Monday, June 11, 2012

నీ స్నేహం.....


మీకు తెలుసా  మీ రెండు కళ్ళ మధ్య ఉన్న సంబందం?  
అవి రెండు కలిసి రెప్పలు అందంగా వాలుస్తాయి...
అవి రెండు కలిసి గుండ్రంగా  తిరుగుతాయి...
అవి రెండు  కలిసి ఏడుస్తాయి...
అవి రెండు  కలిసి చూస్తాయి...
అవి రెండు  కలిసి నిద్రిస్తాయీ...
ఐనా అవి రెండు కలిసి ఒకదానికి ఒకటి చూసుకోలేవు ఎప్పటికి...
అలగే స్నేహం కుడా అంతే,
నీ స్నేహం లేకుండా నా జీవితం వ్రుదా...
నా జీవితాంతం నీ స్నేహం కావాలి మిత్రమా...

Friday, June 8, 2012

చిన్ని ఆశ....


నీ నవ్వు చూడాలని ఆశ.
నీ నవ్వు వినాలని ఆశ.
నీ కళ్ళల్లోకి చూడాలని ఆశ  .
నీ స్వరం వినాలని ఆశ .
నీ ప్రక్కన ఉండాలని ఆశ.
నీ చేయిలో చేయి వేయాలని ఆశ .
నువ్వు నన్ను ప్రేమించాలని ఆశ....

Thursday, June 7, 2012

నా ఆలొచన నువ్వే ..


ప్రతి ఉదయం కల్లుతెరిచి,
సూర్యోదయాన్ని చూసేముందు,
నా ఆలొచన నువ్వే ..

ప్రతి ఉదయం
సూర్యోదయంలోని వెచ్చదన్నాని ఆస్వాదిస్తున్నపుడు
నా ఆలొచన నువ్వే ..

వసంత ఋతువులో మొదటి రోజు
పక్షుల రాగాలు వింటున్నపుడు
నా ఆలొచన నువ్వే ..

మొక్కల పొద్దల్లో దాగివున్న
రోజా పువ్వు ను చూస్తున్నపుడు
నా ఆలొచన నువ్వే ..

సాగరతీరం లో
అలల సవ్వడిని వింటున్నపుడు
నా ఆలొచన నువ్వే ..

అందమైన మరో ప్రపంచం లాంటి
రంగుల హరివిల్లును చూస్తున్నపుడు
నా ఆలొచన నువ్వే ..

Sunday, June 3, 2012

జీవితం...


మన జీవితం ప్రేమించదం నేర్పిస్తుంది.   
మన జీవితం కన్నీళ్ళు అంటే ఎంటో నేర్పిస్తుంది.
ఇదంతా నమ్మసక్యం కాని నిజం కావచ్చు.   
కాని అదే నిజం.
కన్నీళ్ళ విలువ తెలియనంత వరకు,
ప్రేమ విలువ కూడ మనకు తెలియదు....

Thursday, May 31, 2012

నా కల...


నిన్న రాత్రి ఒక కల కన్నాను.
ఆ కల చాల అద్బుతమైనది.
ఆ కల చాల అందమైనది.
ఆ కల చాల  ఫ్రశాంతమైనది.
ఆ కల చాల అందమైన స్వర్గం లాంటిది.
ఈ కల ప్రతిరోజు రావాలని నేను కొరుకుంటున్నాను.
నా కల ఎప్పటికి ముగియొద్దు.
నా కల ఎప్పటికి నువ్వే నువ్వు మాత్రమే.
ఎందుకంటె  ఆ కల లొ నువ్వు ఉన్నావు.
నువ్వు నా కలను నిజం చెసావు. 
నువ్వు నా జీవితాన్ని పుర్తి  చెసావు.
నా హ్రుదయమా,
నువ్వు లేకుండా నా జీవితానికి అర్ధం లేదు.

Sunday, May 20, 2012

నీ స్నేహం.........


నే నడిచిన బాటలో విరిసిన కుసుమం నీ స్నేహం...
నే వదిలిన శ్వాసలో పలికిన భావం నీ స్నేహం...
నా పయనపు గాయం నీ స్నేహం...
నా పలుకుల అర్ధం నీ స్నేహం...
నా అడుగుల శబ్దం నీ స్నేహం...
నా ఆశల అందం నీ స్నేహం
అలాంటి నీ స్నేహానికి నే దూరం కాలేను...
ఆ విరహాన్ని నే భరించలేను.....

Thursday, May 17, 2012

నీలొ నెనై....


నువ్వు నవ్వితె నీ పెదాలపై చిరునవ్వునవుతా.
నువ్వు ఎడిస్తె నీ కంట్లొ కన్నీరవుతా. 
నువ్వు నిద్రిస్తె నీ స్వప్నానవుతా.
నువ్వు చికట్లొ నడిస్తె వెలుగునవుతా.
నువ్వు మట్లాడితె నీలోని భావానవుతా.
నీలొని మనసుని నేనై ప్రెమాభిమానాలు పంచె ప్రేమనవుతా.

Wednesday, May 9, 2012

ఓ ప్రియతమా.....



ఓ ప్రియతమా...



నిన్ను ఎలా ప్రేమిచాలో నాకు తెలుసు.
కానీ నిన్ను ఎలా ద్వేషించాలో నాకు తెలియదు...

నిన్ను ఎలా ఇస్టాపడాలో నాకు తెలుసు.
కానీ నిన్ను ఎలా వదలాలో నాకు తెలియదు...


నిన్ను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు.
కానీ నిన్ను వదిలి దూరంగా ఎలా ఉండాలో నాకు తెలియదు...


నిన్ను  ప్రేమిస్తున్నానని చెప్పడం చెప్పడం నాకు తెలుసు.
కానీ దాన్ని నిరూపించుకోవడం నాకు తెలియదు...

నీ ప్రేమను అనుభవించడం నాకు తెలుసు.
కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలొ నాకు తెలియదు...

Monday, April 30, 2012

నీకోసం నేను పసిడిబొమ్మ నవుతా...


మండుతున్న ఎండను శాంత పరిచే
తొలకరి చిరు జల్లులా వస్తాను...
తీగలా నిన్ను అల్లుకొని నీ మదిలో 
పువ్వులా ఆనంద రాగాలూ పలికిస్తాను...
వసంతాన కూసే కోయిల రాగమై
నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసే కిల కిల రావం అవుతాను...
చిలిపి చేష్టలతో నీలో హావా భావాలను
పలికించి హాయిగొలిపే పసిడిబొమ్మ నేనౌతాను...

Friday, April 27, 2012

నా ఉహా.....


కరుణించే కంఠస్వరం నీవైతే
గర్వించే గుండే నేనవుతా...
వర్షించే మేఘము నీవైతే
సప్తవర్ణాల హరివిల్లు నేనవుతా..
వెసే ప్రతి అడుగు నీవైతే
పులకించే ప్రతి స్పందన నేనవుతా..
మెరిసే తారక నీవైతే
పరచే ఆకాశం నేనవుతా..
ఎద చిత్రించే కలల కుంచె నీవైతే
మది ఫలకంపై ఆశల రంగునవుతా..
ఏ కాంతిలేని ఏకాంతంలోకి పడవేస్తే
నీకు వెలుగునిచ్చే మినుగురు నవుతా..
వరములిచ్చే ప్రేమ నీవైతే
నీకు దాసోహం నేనవుతా.....

Tuesday, April 24, 2012

నువ్వే నా ప్రపంచం...


ప్రతీ ఒక్క ఘడియ నేను నీ కోసమే ఆలోచిస్తాను.
ప్రతీ ఒక్క నిమిషం నేను నీ గురించే పరుగులు తీస్తాను.
ప్రతీ ఒక్క గంట నిన్ను చేరడానికి ప్రయత్నిస్తాను.
ప్రతీ ఒక్క రోజు నీ గురించే కళలు కంటాను.
ప్రతీ ఒక్క క్షణమ్ నేను నీతొనె ఉండాలని కోరుకుంటాను..
అందుకే నువ్వే నా ప్రపంచం...