పేజీలు

Monday, July 15, 2013

నా పేరంటి??


ముద్దబంతి పూవుల ఉండే భారతినా,
సన్నజాజుల ఉండే సరియునా,
మల్లెపూల ఉండే మృధులనా,
నిర్మలమైన నదిలా ఉండే నర్మదనా,
కిటకిట కంటిచూపుతో కట్టేసే కృష్ణవేణినా,
గలగలా నవ్వే గంగనా,
వయ్యారాల నడకతో వినీతనా,
కిల కిలా అల్లరిపెట్టే కిరణ్మయినా,
తొలివెచ్చని కిరణంలా తాకే ఉదయశ్రీనా,
సూర్యాస్తమయాన్ని తలపిచే సంధ్యనా,
అమాయకమైన ముఖముతో అలరించే అఖిలనా
అందమైనా గులాబిలా గుబాలింపుల రోజానా,
మనసు ప్రశాంతంగా ఉండే ప్రశాంతినా,
వెన్నేల్లో అల్లరిపెట్టే చంద్రబింబాన్ని తలపించే చంద్రలేఖనా,
పసిడి కాంతితో పరవళ్ళు తొక్కే స్వర్ణలతనా,
వాసంత ఋతువులో హాయిగావీచే సమీరనా,
నెమలిలా నాట్యాన్ని తలపించే మయురినా,
అందరినిమెప్పించే అందాల భరణినా,
శ్రీమహాలక్ష్మిని తలపించే సిరినా,
మృధుమధురంలా సాగే శృతిలయల సంగీతాల లహరినా?

మీరైనా చెప్పగలరా?

10 comments :

  1. ప్రేమలో అలా పేరు మరచిపోతే ఎలా :-)

    ReplyDelete
    Replies
    1. ప్రేమలో పడ్డాక తెలిసిందండి అలా పేరు కుడా మరచిపోతారని:-)

      Delete
  2. పేర్లతో చమత్కారం! బలేగా చెప్పారండి:-))

    ReplyDelete
    Replies
    1. నచ్చినందుకు దన్యవాదాలు ప్రియగారు:-)

      Delete
  3. "madhu"ryam laanti shruti nee peru

    ReplyDelete
    Replies
    1. మీకు బాగానేతెలుసండి:-)

      Delete
  4. తొలి వెచ్చని కిరణం!

    ReplyDelete
    Replies
    1. తొలివెచ్చని కిరణంలా తాకే ఉదయశ్రీ కాదండి:-)

      Delete
  5. అవునూ ఇంతకు ఎవరు మీరూ...!:) బాగా రాశారు.

    ReplyDelete
    Replies
    1. ముందుగా నచ్చినందుకు దన్యవాదాలు డేవిడ్ గారు,నేను మీ అందరి మృధుమధురంలా సాగే సరిగమల శృతిలయల "శృతి"నండి:-)

      Delete