పేజీలు

Tuesday, November 27, 2012

ఎవరు నువ్వు?


అనుక్షణం వెంటాడుతుంటే నా నీడవనుకున్నాకున్నా,
కానీ ప్రత్యేకమైన రూపం నీకుంది...
ప్రతిక్షణం నీ తలపులే చుట్టుముడుతుంటే నువ్వే నా ఊహానుకున్నా,
కానీ అందమైన జీవితం నీకుంది...
నా చెక్కిళ్ళు ఎరుపెక్కి, చిరునవ్వుతో పెదాలుంటె అదంతా నా పరధ్యాసేననుకున్నా,
కానీ ఆలోచన నీకుంది...
నా నడుమొంపుల్లోని వయ్యారాలు  నన్ను మైమిరిపిస్తుంటే నీస్పర్శే అనుకున్నా,
నీ కార్యక్రమం నీకుంది...

నీ జ్ఞాపకాల జడిలో నన్ను బంధిచేసి, నీకై ఎదురుచూసే నన్ను ఒంటర్నిచేసిన నువ్వెవరివి మరి?

నా నీడవా?
నా ప్రతిబింబానివా?
నా మిత్రుడివా?
నా మనసువా?
నా ప్రియిడివా...
నా ప్రాణమా?

మీరైనా చేపుతారా?



7 comments :

  1. బాగుందండి.తను మీ ప్రియిడు...

    ReplyDelete
  2. అది నేను మాత్రం కాదు ముందే చెబుతున్న (జస్ట్ కిడ్డింగ్) ... శృతి బాగుంది మీ కవిత... ఇంతకు ఎవరు అది?

    ReplyDelete
  3. Thanku @Pirya garu, & David garu.. adi meere cheppalani raasaanu...

    ReplyDelete
  4. నీ సర్వస్వం నేనే......

    ReplyDelete
  5. నీ నీడను నేనే
    నీ ప్రతిబింబాన్ని నేనే
    నీ మిత్రుడిని నేనే
    నీ మనసును నేనే
    నీ ప్రియుడిని నేనే
    నీ ప్రాణం నేనే.
    నీ ఉహను నేనే....నీ పలకరింపు నేనే....నీ సర్వస్వం నేనే......

    ReplyDelete
  6. nee paruvaanike theliyanapudu maaku chikkuthundhaa aa roopam evaridhani ? mammalni parikshisthunnava leka theliyanattu natisthunava :-P

    ReplyDelete