నువ్వెక్కడని ఆకాశాన్నడిగా,
ఉరుములు మేరుపులు తప్ప నీ ప్రియుడి జాడ నాకేల తెలుసు సఖి!...
నువ్వెక్కడని మేఘాలనడిగా,
వర్షం మబ్బులు తప్ప నీ ప్రియుడి జాడ నాకేల తెలుసు సఖి!...
నువ్వెక్కడని సెలయేరునడిగా,
గల గల ప్రవహించడం తప్ప నీ ప్రియుడి జాడ నాకేల తెలుసు సఖి!...
నువ్వెక్కడని సముద్రాన్నడిగా,
అలల శబ్ధంతో ప్రకృతి మాతను ఆరధించడం తప్ప నీ ప్రియుడి జాడ నాకేల తెలుసు సఖి!...
నువ్వెక్కడని వీచే చల్లటి గాలినడిగా,
చల్లదనంతో అందరిని మైమరిపించడం తప్ప నీ ప్రియుడి జాడ నాకేల తెలుసు సఖి!...
నువ్వెక్కడని బోసి నవ్వుల బుజ్జయినడిగా,
కల్మషం లేని మనసు, నా చిరునవ్వు తప్ప నీ ప్రియుడి జాడ నాకేల తెలుసు సఖి!...
ఇంకా ఏక్కడని వెతకను నిన్ను?
నీ కోసం వెతికి వెతికి చూసా, నీ ఫ్రేమకై తిరిగి తిరిగి చూసా,
చివరకు ఒక్క నిజం కనుకున్నాను.
నా హృదయపు మందిరంలో చుసాను...
హృదయపు మందిరంలో అయితేనే నిశ్చింతండి:-)
ReplyDeleteనా హృదయపు మందిరంలో చుసాను...
ReplyDeletesuperb shruti..........
నా హృదయపు మందిరంలో చుసాను... చాల బాగుందండి..
ReplyDeleteధాంక్యు పద్మార్పిత గారు, ప్రియ గారు & పండు గారు. నాకు కూడా ఆ లైన్ చాలా నచ్చింది..
ReplyDelete