పేజీలు

Thursday, January 9, 2014

♥♥ నీ కోసం వేచివున్నా ♥♥


తొలి మంచుబిందువే నా చెక్కిలిని తాకి మురిసిపోనట్టు,
బొండు మల్లె నావాలుజడను తాకి సిగ్గులొలికినట్టు,

నాకనులే కలగన్న చిత్రము నా కళ్ళముందున్నట్టు,
మైమరిచే సొగసుల పుప్పోడుల అందాలు  కదిలినట్టు,

వీచే చల్లగాలే నా మేనును తాకి ప్రేమ సరాగం నాలో కవ్వించినట్టు,
మదిని దోచిన నా పరువం నీరాకతో మైమరచినట్టు,

తొలి వెన్నేలరేయి నా తనువును తాకి  తన్వయంతో తడిమినట్టు,
అందమైన నా ఊహల్లో నువ్వే చిలిపిగా అల్లరి చేసినట్టు,

మధురమైన నా భావాల్లో కలకాలం గీతమై నిలిచినట్టు,
మనసు పాడె గీతం ప్రణయ రాగం ఆలపించినట్టు,

ఇన్నిన్ని భావాలతో నా సోయగాలు నీకై స్వాగతిస్తూ,
కోటి తారల పున్నమి వెన్నల్లో శృంగార కావ్యాన్నై నీ కోసం వేచిఉన్నా..

Wednesday, January 1, 2014

♥మధురం-మధురం♥

నీలి మబ్బుల చాటున చిరు చినుకుల అందం దాగినట్టు,
నీ గుండెలోతుల్లొ దాగున్న ప్రేమ మధురం.


నిండు వేసవిలో కురిసిన జల్లులకు మధి పులకరించినట్టు,
నన్ను తట్టిలేపే నీఆత్మీయత సుమధురం.


వానజల్లులో తడుస్తూ హాయిని అనుభవించినట్టు,
తేనెలొలికే నీమాటలు మకరంధం.


చిరుజల్లుల ఆనందంతో మయూరం నర్తించినట్టు,
నా పరువం, వయ్యారాలతో నీకు కలిగే సంతోషం అతిమధురం.


వానజల్లు తాకిడితో ప్రకృతి పులకిరిచినట్టు,
నీ స్పర్శకు నామధి ఆనందంతో పులకరించిన వైనం మధురం మధురం.


హరివిల్లు సప్తవర్ణాలతో విలసిల్లినట్టు,
నా మనసు ఆనందపు వర్ణాలతో  నిండిపోవడం ప్రియమధురం.. 

Tuesday, December 31, 2013

నూతన సంవత్సర శుభాకాంక్షలు.



నూతన ఆలోచనలతో,
నూతన ఆశయాలతో,
నూతన విజయాలతో,
ప్రేమాభిమానాలు,
ఆప్యాయతానురాగాలు,
అందరి సొంతమవాలని,
పల్లేటుర్లు పచ్చదనంతో ఉండాలని,
మనదేశం అభివృద్ది ధిశవైపు నడవాలని,
ప్రతి ఒక్కరి జీవితం రంగులమయం కావాలని,
2014 కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.
బ్లాగ్ మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.


Friday, December 20, 2013

నీ జ్ఞాపకాల ఆనవాళ్ళు!


నీలాకాశపు మనసు లోతునుంచి పృథ్విపై కురిసే చినుకుల్లా,
నా హృదయాకాషాన్ని తలిచే నీ జ్ఞాపకాల  ఆనవాళ్ళు,

పెదవుల మౌనానికి శ్వాసై నిలుస్తుంటే,
ప్రేమఅనే నాస్వప్నలోకంలో ఆ నీ జ్ఞాపకాల ఆనవాళ్ళుతట్టి లేపుతున్నాయి,

నీవు అనే భావన మనసుకు ఊపిరిలా,
నేనే నీవైపోయి జీవితాన్ని అనుభూతిస్తు,

నాదేహాన్ని స్పృశిస్తుంటే భావోద్వేగాల్ని చీల్చుకొని,
కొంటే కోరికలు రెక్కలు విప్పి మయూరమై నర్తిన్చినట్టుంది,

మనసులో ఆశలు  ఉప్పెన అలల్లా నా ఎకాన్తంపై రాలుతూ ఉంటె,
మన బాంధవ్యానికి ప్రణయ ప్రయణంతో సుఖసాగరం చేసిన వేళ అద్బుతం...

Thursday, December 12, 2013

నాలోనీవై నీలోనేనై!


వెన్నెల రాత్రిలో సెలయేటి నడకలా,
నీకై ఆరాటంతో,
నీకై ప్రేమే ఆరాద్యంగా,
నా కడలి తనువు పులకరిస్తుంటే..

ఎప్పుడో నీలి మబ్బులపై నేను లిఖించిన,
ప్రేమలేఖ పరిమలాలు,
ప్రతి అలలో ప్రతిబింబమై,
కళ్యాన కాంతులు విరజిమ్ముతుంటే..

మమతల తీరపు వాకిటిలో,
నీకై నేవేచిఉన్నా ప్రియా,
నాలోకి నిన్ను ఆహ్వానిస్తూ,
నీలోకి నేను పయనిస్తూ..!

Wednesday, December 4, 2013

పద్మార్పిత గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..


దూరపు కొండల నుండి ఉదయించే సూర్యోదయంలా ప్రతి కిరణం ఊరు వాడ తాకి వెలుగు నిచ్చినట్టు,
మీ ప్రతీ అభిమానుల హృదయాలు తాకి మనసును ఆనందింపచేస్తుంది..

సెలయెటీ సరిగమలకి పులకించే ప్రతి అల నాట్యం చేస్తున్నట్టు,
మీ భావాల ఝురిలో ప్రతి పదం నర్తించి అలరిస్తుంది..

పైరు పచ్చని పంట పొలాలతో నేలతల్లి ఆహ్లాదంగా వికసించినట్టు,
మీ ప్రతీ కవిత గానమై సరాగాలాడుతుంది.

ఫూల తోటలో పూల వణంలా, మల్లే తోటలో మల్లే పూవులా, కోనేరులో తామరంలా,కలకాలం వికసించాలని.
ఇలా నిండునూరెళ్ళు మీరు కవితలు వ్రాస్తూ ఉండాలని మా ఆశ.

Friday, November 29, 2013

అపజయాల ప్రేమ..


గుండె లోతుల్లో జనియించిన లావ
మనసుని దహించివేస్తుంది.

విరహం నిండిన మనసు
విస్పొటనం కలిగిస్తుంది.

కర్తవ్యం మరచి వ్యక్తిత్వం విడచి
నీచుట్టు పరిభ్రమించిన గతం వెక్కిరిస్తుంది.

అబలను ఆటబొమ్మగా వాడి వదిలివేసిన వైనం
ధర్మం అంధకరంలా ఉందని తెలియజేస్తుంది.

అస్తిత్వం పోగొట్టె ప్రేమకు అమరత్వం ఎలా వస్తుంది
అపజయాల పల్లకిమోసె ప్రేమ ఎందుకు.

బాదతో నిండిన మనసు
కొవ్వోత్తిలా కాలి కరిగిపోతుంది.

కన్నీరు ప్రవహాంలా పారి
మనసు మూగబోయింది.

నీవు లేని వర్తమానంలో
నీవు రాని భవిష్యత్తుకై ఎదురుచుస్తున్నాను.

Monday, November 25, 2013

నువ్వుంటే చాలు!


అంబరమంతా సంబరంలా విలసిల్లిపోతుంది.
మేఘం మణి మాణిక్యమై వెలుగుతుంది.

చెదిరిపోయిన స్వప్నం కుడ తిరిగి పొదుగుతుంది.
వసంతం వర్షించి కోకిల గానాలతో తీయని స్వర రాగాలతో వినిపిస్తుంది.

నా హృదయ వీణలోని మౌన తరంగాలు కదలి మధుర రాగాలు ఆలపిస్తుంధి.
నీ నవ్వుతో సంతోషం సగంబలం లా అనిపిస్తుంది.

నీ ప్రేమ లాలాపనలో అదరాలు ఎరుపెక్కి చెక్కిళ్ళు సిగ్గుతో ఉన్నట్టుంది.
నా సాయంత్రపు సామ్రాజ్యం సప్తవర్ణాలతో నిండిపోతుంది.

Saturday, November 23, 2013

నా ఆశ!


వడగాల్పుల్లో నీవు నడచి వచ్చినపుడు,
మలయ మారుతమై నిన్ను చుట్టాలని..

శ్వేదం శరీరాన్ని కమ్ముకున్నప్పుడు,
వింజామరనై వీచి చల్లబరచాలని..

చిరు చెమటలు నుదుట అలముకున్నప్పుడు,
చల్లటి వస్త్రమై నీమోము తడమాలని..

దాహార్థి కలిగినపుడు,
సెలయెటినై నీ ధారిలో సాగాలని..

అలసిన నీమేను సేధతీరుటకు,
ఫూలపానుపునై అమరాలని..

నీవు నదిచే ప్రతి అడుగులొ నలిగే పాధ ధూలినై,
నిన్ను ఆరాధించాలని..

నీమాటలో పధాల అమరికనై,
నువ్వు మట్లాడే భాషలా ఉండాలని..

నీ స్వరంలో శబ్ధాన్నై, ఆరోహన అవరోహన శృతినై,
నీ అనుమతితోనె నా శ్వాస నిలపాలని..

నా మనసుపడే ఆశ..
ఈ ఆశలన్ని నెరవేరేది ఎప్పుడో?

Saturday, November 16, 2013

నే మరువను నిన్ను!


పున్నమి నాడు వెన్నేలలో చంద్రునిలా నన్ను చుట్టుముట్టినావు.
సాయంకాలం మల్లె తీగవై సుగంధంలా నన్నల్లుకున్నావు.
వర్షకాలము వానలో చినుకువై నన్ను తడిమిపోయావు.
శీతాకాలము చలిలో మంచుముద్దలా నన్ను స్పర్శించినావు.
నా నయనం నిద్రిస్తుండగా కలవై నన్ను కవ్విస్తున్నావు.
పిల్లగాలికి హాయిగా సేదతీరుతుండగా పిలనగ్రోవిలా పలకరించిపోయావు.
గలగలపారే నధిఒడ్డున నేనుంటే అలల సిరి సిరి మువ్వల సవ్వడివై నన్ను తాకిపోయావు.
నువ్వు వస్తున్నావని పావురంతో కబురు పంపించావు.
కోకిలమ్మ గానంతో నీలేఖ పాటగా పాడించావు.
నా ఆలోచనలో చిరునవ్వనే మధురత్వాన్ని పరిచయం చేసావు.
నా ప్రాణం, నాధ్యానం, నువ్వేనని తెలిసేలా చేసావు.
నువ్వొస్తున్నావని  తెలిసి పరవళ్ళుతొక్కుతూ పరవశంతో  ఎదురుచూస్తున్నాను.
నే మరువను నిన్ను!

Thursday, November 14, 2013

♥♥ మధి తలపులు ♥♥

విప్పకనే విప్పేసా మనసులో మాటలని,
భాషకందని భావాలేన్నేన్నో..
మాటలకందని మమకారాలెన్నెన్నో..

చెప్పకనే చెప్పేసా మధి తలపులని,
నీకై ఆలోచనలెన్నేన్నో..
నీకై భావాలుమరింకెన్నో..

అడగకనే ఆడిగేసా నాపైనీకున్న భావాన్నీ,
నాలో నచ్చినవేంటేటోని..
నాపై నీకున్న నమ్మకమేమిటోనని..

ఇవ్వకనే ఇచ్చేసా నామనసుని,
నీపై నాకున్న ప్రేమ అందమైనదని..
చెలికాడి ఊసులు చిలిపి వలపులని..

చూపకనే చుపేసా తొలిస్పర్శ అందాలని,
నా సిగ్గు, వలపు, అల్లరి నీకిస్టమని..
నాచిరునవ్వే నీకు సంతోషమని.

కలపకనే కలిపేసా నీజీవితంలో నన్ను,
ప్రణయ ప్రయాణం సుఖసాగరమని..
నువ్వు నేను వేరుకానని..

Tuesday, November 5, 2013

ఏం చేసేది?? నేనేం చేసేది??


సుమధుర దరహాసంతో చిరున్నవ్వులు చింధించినా!
మమతల మాటలతో మమకారం చూపించినా!
మొండి మొగుడు పట్టించుకోడు ఏం చేసేది?? నేనేం చేసేది??

కడుపునిండా మూడుపూటలు భోజనం పెట్టినా!
కన్న తల్లికన్న మిన్నగా, పసిపాపకన్న ప్రేమగా చూసుకున్నా!
మొండి మొగుడు పట్టించుకోడు ఏం చేసేది?? నేనేం చేసేది??

వలపు సొగసులతో అందాలు ఆరబోసినా!
పరువం ప్రణయం తనకే అంకితం అన్నా!
మొండి మొగుడు పట్టించుకోడు ఏం చేసేది?? నేనేం చేసేది??

నీ నిద్రమత్తు వదలడానికి అలజడి సృష్టించనా?
చిపురుతో జాడించి దుమ్ముదులపనా??
నువ్వు మారని మనిషివని భాదపడనా???

నిద్రమబ్బు భర్తలతో ఏగుతూ, భర్యని సరిగ్గా పట్టించుకోనివారిని ఎం చేయాలో మీరే చెప్పండి..

Monday, September 23, 2013

చెలికాడి చిలిపి అల్లరి!


నా మేనిచాయ మెరుపు తీగలా,
మల్లె పూల మాల కట్టి,
జాలువారు జడన గుచ్చి,
పూల సజ్జ చేతబట్టి,
గందం మెడను చుట్టి,
చిరు చెమటల మోముతో,
వయ్యారి నడకతో,
హంస నడక నడుస్తుంటే,
చక్కనైన చిన్నోడు!
చెలికాడిని అన్నాడు..
చిర్రెత్తిన చిన్నది,
చిర్రు బుర్రు లాడుతుంటే,
ఆ అందం చూడతరమా!
ఆపతరమా ఆ సుగంధం!
అని కల్లబొల్లి మాటలతో మోసేస్తున్నాడు...

Thursday, August 29, 2013

నా మనసులోని భావం..



నీ కన్నుల వెలుగులో శయనించాలని ఉంది,
కాని నా చూపు నిన్ను వెతకడంలో తడబడుతుంది..

నీ అధరాల తీయదనాన్ని ఆస్వాదిన్చాలని ఉంది,
కాని నా  సిగ్గు వద్దొద్దని ఆపుతుంది..

నీ చిరున్నవ్వులోని హాయిలో  రేయి గడపాలని ఉంది,
నీకున్న పరిదిలో నేను నీకు తగునా అని నా మనసు సతమతమవుతుంది..

మధురమైన తేనెల మాటలలో మునుకలు వేయాలని ఉంది,
మౌనం నిన్ను దరిచేరకుండా ఆపుతుంది..

మనసులో భావాలన్ని నీతో పంచుకోవాలని ఉంది,
భావం భాషతో ఏకీభవించక మాటలురాకుండా చేస్తుంది..

నా మనసు నీరాకను గ్రహించి నీచెంతకు ఉరకలు వేయాలని ఉంది,
నాపై నీకున్న భావం ఏమిటో అర్ధంకాక పాదం వెనుకాడుతుంది..

నీతో కలిసి కలకాలం జీవించాలని ఉంది,
ఇవన్ని తెలియకుండా నిన్నెలా అంచన వేయాలో తెలియకుండా ఉంది.. 

Thursday, August 22, 2013

నీ తలపులతో !





నిన్ను తలవకుండ నిమిషమైన ఉండాలనుకుంటా,
కాని నువ్వు వదిలి వెళ్ళిన మనసు నాకన్న నిన్నె ఎక్కువగా తలుస్తుంది..

నీ పేరునైనా మరిచిపోదామని పెదవిని మౌనంతో భందిస్తే,
నువ్వు వెలివేసిన హృదయం నీపేరునే గుండె చప్పుడుగా మార్చుకుంది..

నీ రూపానయినా మరిచిపోవాలని కనురెప్పలను అడ్డుపెడితే,
కనుపాప కమ్మని స్వప్నంలొ నిన్ను తలచుకుంది..

నీ జ్ఞాపకాలనైన మరచిపోవాలని కన్నీటిని వదిలేసే,
కన్నీరు హృదయపుటంలొ కవితలా అళ్ళుకుంది..

నిన్ను తలవకుండా నిమిషమైన ఉండలేనని తెలిసి,
నాకు నేనె దూరమవుతున్నా..

నమ్ముతావా? అరిచేతుల్లో ప్రాణం పెట్టుకొని,
నువ్వు నాతోనే ఉన్నావన్న భావంతో జీవిస్తున్నాను..