పేజీలు

Wednesday, January 23, 2013

ప్రేమంటే!!!

వర్షంలో ఒకే ఒక్క గొడుగులో నడిచిన
మన పాదాల అడుగులకు తెలుసు ప్రేమంటే!

మేఘల ఘర్షణ లో ఉరుముల మెఱుపుకు
కలిసిన మన కనులకు తెలుసు ప్రేమంటే!

కంటి సైగతో పలకరిస్తే బదులు పలికే
చిరునవ్వుకు తెలుసు ప్రేమంటే!

మమత నిండిన నీచేతి స్పర్శతో
స్పందించే నామదికి తెలుసు ప్రేమంటే!

మల్లే, సన్నజాజి పూల పరిమళానికి
నిన్ను ఆకర్షిచే మైకానికి తెలుసు  ప్రేమంటే!

కలలు నిజమై మన మనసులు ఒక్కటై
మమతానురాగానికి తెలుసు ప్రేమంటె!

అల్లిబిల్లి కబుర్లతో, చిలిపి సరసాలతో
నన్ను ఆట పట్టించే, అమాయకత్వానికి తెలుసు ప్రేమంటే!

నా ఆశ, శ్వాశ, తల్లి, తండ్రి, ప్రాణం నీవై
నన్ను ప్రాణంగా చూసుకునే స్నేహానికి తెలుసు ప్రేమంటే!

మన ఇరువురి మధ్య ప్రణయమై
కలసిపోయే మన హృదయనికి తెలుసు ప్రేమంటే!

11 comments :

  1. భలే బాగారాసారు.

    ReplyDelete
  2. మొత్తంగా కవితలోని ప్రతి పాదం తెలిపిన పరమార్థం - ప్రేమించిన వారికే ప్రేమంటే ఏమిటో తెలుస్తుందని! చిన్న చిన్న పదాలలో ఎన్నో ఎన్నో భావాలు పలికింది మీ కవిత..... చాలా బాగుంది.

    ReplyDelete
  3. అల్లిబిల్లి కబుర్లతో, చిలిపి సరసాలతో
    నన్ను ఆట పట్టించే, అమాయకత్వమే ప్రేమంటే!

    నా ఆశ, శ్వాశ, తల్లి, తండ్రి, ప్రాణం నీవై
    నన్ను ప్రాణంగా చూసుకునే స్నేహానికి తెలుసు ప్రేమంటే!

    nee sneham nene kada priyaa....naaku telugu nee premante!

    ReplyDelete
  4. రుద్రాక్ష్January 24, 2013 at 12:05 AM

    really so sweeeeeeeeet...........

    ReplyDelete
  5. Thank u so much Anonymous, Padmarpitagaru, mahesh gaaru, Rudr & Priya garu.. Thanx a lot...

    ReplyDelete
  6. nice andi meeku pratidi premaku rupam ga kanipistundi anukuntanu...

    ReplyDelete
    Replies
    1. Thanx Prince garu, premato chuste premagaane untundi kada...

      Delete
  7. చాల్ల బాగుంది శృతి గారు మీ కవిత బాగుంది

    ReplyDelete